ఉపాధి మహిళా సంక్షేమాన్ని కేంద్ర ప్రభుత్వం విస్మరించిందని అందుకు నిరసనగా ఎస్ ఎఫ్ ఐ డివైఎఫ్ఐ ఐద్వా సంఘాల ఆధ్వర్యంలో విద్య ఉపాధి కల్పనను మహిళా సంక్షేమాన్ని కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో విస్మరించి నందున శనివారం నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శులు సబ్బని లత, అనిల్ లు మాట్లాడుతూ.. ఆన్లైన్ విద్యావిధానం ముసుగులో టీవీ చానల్స్ ని పెంచి విద్యార్థులకు భౌతిక విద్యను దూరం చేయడమే అని అన్నారు. అదేవిధంగా విద్యారంగానికి 2.58% బడ్జెట్ తో విద్యారంగం ఎలా అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అదేవిధంగా ఏటా రెండు కోట్ల ఉద్యోగాల హామీని పక్కన పెట్టి మేకిన్ ఇండియా పేరుతో భ్రమలు కల్పించే బడ్జెట్ ని తిరస్కరించాలని అన్నారు. అదేవిధంగా ప్రైవేటీకరణ కార్పొరేటీకరణ బడ్జెట్ గా అభివర్ణించారు. మహిళల సంక్షేమాన్ని మరింతగా తగ్గించడం బాధాకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షలు రాచకొండ విగ్నేష్, ఐద్వా అధ్యక్షురాలు సుజాత,డివైఎఫ్ఐ జిల్లా కన్వీనర్ పిట్ల నరేష్, నాయకులు పి మహేష్, లావణ్య, లక్ష్మీ ప్రసన్న, అనిత, అంగుధ్ గనియా, గణేష్,
Leave a comment