బిజెపి కార్యకర్తల ఆందోళన
భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి మామిడిపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం సకాలంలో పూర్తి కాకపోవడాన్ని నిరసిస్తూ రైల్వే ట్రాక్ పైన పాత్రికేయుల సమావేశం నిర్వహించడమైనది.
పాత్రికేయుల సమావేశంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి జివి నర్సింహారెడ్డి, బిజెపి ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు జెస్సు అనిల్ కుమార్ లు మాట్లాడుతు రైల్వే ఓవర్ బ్రిడ్జ్(ROB) కొరకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా అదేవిధంగా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి బాల్కొండ ఎమ్మెల్యే మరియు మంత్రివర్యులు అయిన ప్రశాంత్ రెడ్డి, నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత వీరందరు కూడా చొరవతీసుకోని కారణంగా, వీరి నిర్లక్ష్యం కారణంగా రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు పూర్తికాకపోవడంతో గత సంవత్సరం ఇదే నెలలో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు గౌరవ ధర్మపురి అరవింద్ గారు రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణపనుల విషయంలో పరిశీలించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను వినియోగించుకుని ప్రజల సౌకర్యార్థం వెంటనే రైల్వే పనులు చేపట్టాలని ఈ ప్రభుత్వానికి మరియు అధికారులకు సూచించినప్పటికీ, అడపాదడపా
సామాజిక మాధ్యమాల ద్వారా ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు కు కూడా ఈ విషయాన్ని తెలియజేసినప్పటికీ, ఈ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడమే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు పక్కకు పెట్టి అనవసరమైన విషయాలను రాజకీయం చేస్తూ పబ్బం గడుపుకుంటు ప్రజలను పక్కదారి పట్టిస్తుందని. ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ లో తప్పతాగి, పండుకొని ప్రజల సమస్యలను గాలికి వదిలేయడం జరిగిందని, ప్రజలు ప్రతి విషయాన్ని గమనిస్తున్నారని కావున వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తేరుకొని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత వెంటనే స్పందించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రజల సౌకర్యార్థం వెంటనే రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులను పూర్తి చేయాలని కోరడమైనది. లేనట్లయితే రాబోయే కాలంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి విషయమై ప్రజలను చైతన్యవంతులను చేసి ప్రజా ఉద్యమాన్ని చేస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడమైనది.
ఈ కార్యక్రమంలో బిజెపి ఆర్మూర్ పట్టణ ఉపాధ్యక్షులు శ్యామ్ గౌడ్, బిజెపి సీనియర్ నాయకులు శికారి శ్రీనివాస్, కౌన్సిలర్ బ్యావత్ సాయికుమార్, గోవింద్ పేట్ సొసైటీ వైస్ ఛైర్మన్ తూర్పు రాజు, బీజేవైఎం ఆర్మూర్ పట్టణ ప్రధాన కార్యదర్శి ఉదయ్ గౌడ్, దళిత మోర్చా ఆర్మూరు పట్టణ అధ్యక్షులు పులి యుగంధర్, కిసాన్ మోర్చా ఆర్మూరు పట్టణ కార్యదర్శి లక్కారం సాగర్ తదితరులు పాల్గొన్నారు.
Leave a comment