నందిపేట్, తెలంగాణ వార్త: నందిపేట్ మండల కేంద్రంలోని 12వ కాలనీలలో పంగ లక్ష్మి సఫాయి కార్మికురాలు గత నెల కిందట సఫాయి పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు డ్రైనేజీలో పడిపోయి పక్కనున్న ఇనుప సలక ఆమె కుడి కాలు గుచ్చుకోవడం జరిగింది. దీనిని గమనించక ఆమె కుడికాలు పూర్తిగా ఇన్ఫెక్షన్ కావడం జరిగింది. సమాచారం తెలుసుకున్న నందిపేట్ గ్రామ డిప్యూటీ సర్పంచ్ వారి వద్దకు వెళ్లి ఆర్థిక సహాయాన్ని అందించి, 25 కేజీల బియ్యాన్ని అందించి అధికారులతో మాట్లాడి వెంటనే 108 అంబులెన్స్ ను ఏర్పాటు చేసి నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది.. తమ వెంట దుబాయ్ శీను, చిన్నయ్య, బోజందర్, గాండ్ల సంతోష్ తదితరులు ఉన్నారు.
Leave a comment