తెలంగాణ వార్త:: శనివారం ప్రారంభం కానున్న గణేష్ ఉత్సవాల నేపథ్యంలో గురువారం హైదరాబాద్ మేయర్ శ్రీమతి గద్వాల్ విజయలక్ష్మి , ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ శ్రీ హేమంత కేశవ పాటేల్, ఐఏఎస్ హయత్ నగర్ సర్కిల్ పరిధిలో ఉన్న నాగోల్ చెరువు మరియు మాన్సూరాబాద్ చెరువును సందర్శించి అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు, ప్రజలకు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది మరియు కాలనీ వాసులకు మట్టి వినాయకులను పంపిణీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎల్బీనగర్ జోన్ శ్రీ అశోక్ రెడ్డి, జాయింట్ కమిషనర్ కృష్ణకుమారి, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ శ్రీమతి అన్నపూర్ణ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ శ్రీ పున్న నైక్, డిప్యూటీ డైరెక్టర్ వెటర్నరీ శ్రీ రంజిత్, సీనియర్ ఎంటోమోలజిస్ట్ శ్రీమతి రజనీ, సిటీ ప్లానర్ శ్రీ శ్రీనివాస్ యాదవ్, హయత్ నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ తిప్పర్తి యాదయ్య, నాగోల్ కార్పొరేటర్ శ్రీమతి చింతల అరుణ, మన్సురాబాద్ కార్పొరేటర్ శ్రీ కొప్పుల నరసింహారెడ్డి, బి.యన్ రెడ్డి నగర్ కార్పొరేటర్ శ్రీ మొద్దు లచ్చి రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ రమేష్ బాబు, అసిస్టెంట్ సిటీ ప్లానర్ శ్రీమతి పావని, ఎస్ డబ్ల్యూ ఎం డిప్యూటీ ఇంజనీర్ శ్రీమతి నీలిమ, శ్రీమతి మేధ, ఆర్టికల్చర్ మేనేజర్, ఎంటమాలజీ ఏఈ శ్రీ రవీంద్రనాథ్ రెడ్డి మరియు వివిధ విభాగాల అధికారులు అనగా పోలీస్, ట్రాఫిక్, వాటర్ వర్క్స్, మెడికల్ అండ్ హెల్త్, ఫైర్ సర్వీస్, టిఎస్పిసిడిఎస్ఎల్ అధికారులు పాల్గొన్నారు.
Leave a comment