-మంత్రి సానుకూల స్పందన
హైదరాబాద్, నవంబర్ 23 ::తెలంగాణ వార్త
ఆర్మూర్ నియోజకవర్గంలోని పలు గ్రామాలకు అవసరమైన నిధులు కేటాయించి అభివృద్ధికి సహకరిస్తానని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హామీ ఇచ్చారు. పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్ ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి బుధవారం పలువురు సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి
హైదరాబాద్ లోని మంత్రుల నివాస ప్రాంగణంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తన నియోజకవర్గంలోని పలు గ్రామాలలో ఉన్న సమస్యలను జీవన్ రెడ్డి మంత్రి దయాకర్ రావు దృష్టికి తీసుకువచ్చారు. ఏ ఏ గ్రామాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయో, వాటి పరిష్కారానికి ఎన్ని నిధులు అవసరమవుతాయో పేర్కొంటూ జీవన్ రెడ్డి మంత్రికి వినతిపత్రం సమర్పించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి వీలైనంత త్వరగా నిధులు మంజూరు చేసి ఆర్మూర్ నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మంత్రి దయాకర్ రావుకు ధన్యవాదాలు తెలిపారు.
మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో జీవన్ రెడ్డి సమావేశం
-రోడ్ల పరిస్థితిపై సమీక్ష
ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
హైదరాబాద్ లోని మంత్రుల నివాస ప్రాంగణంలో బుధవారం రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆర్మూర్ నియోజకవర్గం పరిధిలోని రోడ్ల పరిస్థితి పై సమీక్ష నిర్వహించారు. ఇటీవల భారీగా కురుస్తున్న వర్షాల వల్ల పలు గ్రామాలలో రోడ్లు దెబ్బతిని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జీవన్ రెడ్డి మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఏయే గ్రామాల్లో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉందో తెలియజేస్తూ ఆయన వినతిపత్రం సమర్పించారు. వీలైనంత త్వరగా అన్నిగ్రామాలలో దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టి ప్రజల ఇబ్బందులు తొలగించడానికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని జీవన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కాగా మంత్రి ప్రశాంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారని జీవన్ రెడ్డి మీడియాకు తెలిపారు. జీవన్ రెడ్డి సారధ్యంలో మంత్రి ప్రశాంత్ రెడ్డిని కలిసిన వారిలో పలువురు సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులు ఉన్నారు.
Leave a comment