Home హాట్ న్యూస్ మేడే స్పూర్తి తో కార్మిక హక్కుల కై ఉద్యమిద్దాం
హాట్ న్యూస్

మేడే స్పూర్తి తో కార్మిక హక్కుల కై ఉద్యమిద్దాం


ఆర్మూర్( తెలంగాణ వార్త) ప్రపంచ కార్మికుల దినోత్సవం ‘మేడే’ సందర్భంగా ఆర్మూర్ పట్టణ కేంద్రంలో గల సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా పార్టీ కార్యాలయం కుమార్ నారయణ భవన్ వద్ద ఎర్రజండా ను IFTU జిల్లా అధ్యక్షుడు ముత్తెన్న ఎగురవేశారు, అట్లాగే లేబర్ కాలనీలో ప్రజాపంథా పార్టీ ఆర్మూర్ సబ్ డివిజన్ నాయకులు కిషన్, కమలనెహ్రు కాలనీ లో ప్రజాపంథా పార్టీ సబ్ డివిజన్ నాయకులు ఠాకూర్ లు జండా ను ఎగురవేశారు.
ఈ సందర్భంగా ప్రజాపంథా పార్టీ నేతలు దేవారాం,ముత్తెన్న,కిషన్,ఠాకూర్ లు మాట్లాడుతూ చికాగో అమరవీరుల రక్త తర్పణ తో సాధించుకున్న 8 గంటల పని అట్లాగే కార్మికులకు కనీస జీవన ప్రమాణాల మెరుగుదల, కార్మిక హక్కులను సాధించుకున్న రోజు మేడే అని అన్నారు.
బిజెపి మోడీ ప్రభుత్వం
ఎందరో అమరుల రక్త తర్పణ తో సాధించుకున్న చట్టాలను 44 చట్టాలను 4 కోడ్ లుగా కుదించిన వేళ 136వ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము అని అన్నారు కార్మికవర్గం కసితో పోరాడాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రభుత్వాలను కూల్చే ఐక్య ఉద్యమాన్ని నిర్మిద్దమని అన్నారు. చట్టంగా ఆమోదించిన కనీస వేతన చట్టాన్ని అమలు చేసుకోవటం కోసం కార్మికవర్గం పోరాడాలని పిలుపునిచ్చారు.

అమెరికాలోని చికాగో నగరంలో 8 గంటల పని, మెరుగైన జీవనం 1886లో కార్మికవర్గం రక్తం చిందించిన రోజుమే డే అన్నారు.
8 మంది అమరులైన వేళ ఇది ప్రపంచ కార్మిక వర్గానికి పోరాట దినంగా ఆవిర్భవించిందని అన్నారు.
ప్రపంచం సాంకేతికంగా అత్యంత వేగంగా అభివృద్ధి అయిన వేళ ఇంట్లో కూర్చుని మనిషి ప్రపంచాన్ని వీక్షిస్తున్నాడని, విశ్వమానవుడు ధ్వని వేగం కన్నా 20 రెట్ల అధిక వేగంతో రాకెట్ లాంచర్ ప్రయోగిస్తున్నారు అని అన్నారు.
వేల సంవత్సరాల తరబడి చేసే పనులను చిటికెలో పూర్తి చేయగలుగుతున్నారు అని అన్నారు.
కానీ రాకెట్ ప్రయోగంలో భారత్ ఆకలి సూచికలో 101 దిశగా నిలిచిందని ఏటా 25 లక్షల మంది ఆకలిచావులు 35 శాతం బాలింతలు రక్తహీనతతో మరణిస్తున్న 45% గా బరువులేని బాల్యం అని లెక్కలు చెబుతున్న ప్రపంచానికి తిండి పెట్టగల స్థితి భారతదేశానికి ఉన్న తిండిలేక అలమటించి, అవమానంతో జీవిస్తున్నారని అన్నారు.

పోరాడి సాధించుకున్న హక్కులను నరేంద్ర మోడీ, కేసీఆర్ ప్రభుత్వం , హక్కులు లేకుండా కార్మిక సంఘాలు పెట్టుకోకుండా చేస్తున్నారని అన్నారు. కార్మికులను కంపెనీలకు,ప్రైవేట్ వ్యక్తులకు బానిసలుగా మార్చే చట్టాలను తీసుకు రావడం సిగ్గుచేటు అన్నారు.
ఈ విధానాలను కార్మికవర్గం తీవ్రంగా ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు.

మేడే కార్యక్రమంలో ప్రజాపంథా పార్టీ సబ్ డివిజన్ నాయకులు ఇస్తారి రమేష్,జక్కం శేఖర్, PYL రాష్ట్ర సహాయ కార్యదర్శి సుమన్,PDSU డివిజన్ అధ్యక్షుడు నరేందర్, ఏరియా అధ్యక్షుడు అనిల్ కుమార్, నాయకులు నజీర్, పద్మ, లక్ష్మి, మనోజ్, శ్రీనివాస్,కిషోర్, విజయ్, వినోద్, అభి,ఆకాష్, సాయి తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page