మెదక్ జిల్లా.
తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్లలో ఉన్నటువంటి (365) వాహనాలను Abandoned/Unclaimed/Unknown property గా గుర్తించి, తేది 02.12.2022 నాడు ఉదయం 10 గంటలకు మెదక్ జిల్లా కేంద్రం అవుసులపల్లి లోని జిల్లా నూతన పోలీస్ ప్రధాన కార్యాలయ ప్రాంగణంలో వాటిని బహిరంగ వేలం పాట నిర్వహిస్తున్నట్లు తెలిపినారు.ఇట్టి వాహనాలు వ్యక్తిగత వాడుకకు (personal use) నిరుపయోగంగా ఉన్న వాటి యొక్క విడి భాగాల పనితనం మెరుగుగా ఉందని తెలిపారు. ఈ వేలంలో ఉన్నటువంటి వాహనాల గురించి Proclamation (ప్రకటన) ఇచ్చి 6 నెలల గడువు మూగిసినందున ఇట్టి వాహనాలు వేలం వేయుటకు నిర్ణయించినారు, ఈ వాహనాల యొక్క పూర్తి వివరాలు జిల్లా పోలీసు facebook మరియు twitter నందు పొందుపరిచారని తెలిపారు. ఇట్టి వేలం పాటలో పాల్గొనదలచిన వారు వివరాలకు ఆర్.ఐ. అచ్యుత రావు ని (9492589447) లేక మెదక్ రూరల్ సి.ఐ. ఎస్.విజయ్ ని (9490617015) సంప్రదించవచ్చని తెలిపారు.
Leave a comment