నిజామాబాద్, (తెలంగాణ వార్త) మెడికో విద్యార్థిని మృతి చెందడాన్ని తీవ్రంగా ఖండిస్తూ లో డాక్టర్ దారావత్ ప్రీతి నాయక్ కు యన్.టిఆర్ చౌరస్తా వద్ద కోవ్వత్తుల ర్యాలీ తో నివాళులు అర్పించారు.
ఈ సందర్బంగా బంజార సంఘం నాయకులు మాట్లాడుతూ మెడికో విద్యార్ధి మరణానికి కారణమైన సైఫ్ ను కఠినంగా శిక్షించాలని కంప్లెయింట్ ఇచ్చిన కూడా స్పందించని కళాశాల హెచ్ .ఓ.డి మరియు ప్రిన్సిపాల్ ను విదుల నుండి తొలగించాలని ప్రితి కుటుంబం లో ఒకరికి గ్రూప్-1 ఉద్యోగం తో పాటు కోటి రూపాయల ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది .
మళ్ళి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు .
ఈ కార్యక్రమంలో. మెప్మా పి.డి రాములు,AIBSS జిల్లా అధ్యక్షులు చంద్రు నాయక్, తారాచంద్ నాయక్ టివియువి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమావత్ లాల్ సింగ్, గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు జైత్రాం రాథోడ్,తపస్,యస్.సి.యస్.టి టిచర్ సంఘం నాయకులు స్వామి, రమేష్ నాయక్ , యల్.యచ్.పి.యస్ పరుశురాం, వాసు ఏ.ఐ.యస్.యఫ్ జిల్లా కార్యదర్శి రఘురాం, తదితరులు పాల్గొన్నారు
Leave a comment