Home జనరల్ గిరిజన బిడ్డ డాక్టర్ ప్రీతి గారి ఆత్మకు శాంతి కలగాలని ఆర్మూర్ బిజెపి పట్టణ శాఖ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ…
జనరల్

గిరిజన బిడ్డ డాక్టర్ ప్రీతి గారి ఆత్మకు శాంతి కలగాలని ఆర్మూర్ బిజెపి పట్టణ శాఖ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ…

ఆర్మూర్, (తెలంగాణ వార్త) : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో బిజెపి గిరిజన మోర్చా ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తూ డాక్టర్ ప్రీతి ఆత్మ శాంతి చేకూరాలని పట్టణంలోని బాబాసాహెబ్ అంబేద్కర్ చౌరస్తా వద్ద భారీ సంఖ్యలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా గిరిజన బిడ్డ డాక్టర్ ప్రీతి మరణానికి కారకులైన దోషులను కఠినంగా శిక్షించాలని వారు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు వివరాలకు వెళితే..

ప్రీతి కన్నుమూత..

ఐదు రోజులు మృత్యువుతో పోరాడి మెడికో తుదిశ్వాస

» ఫలించని నిమ్స్ డాక్టర్ల ప్రయత్నాలు

శనివారం నుంచి రంగు మారిన శరీరం

» పరిస్థితి విషమించి ఆదివారం రాత్రి మృతి

» ప్రీతి కుటుంబానికి రూ.30 లక్షల పరిహారం » దోషులను కఠినంగా

ఎంతటి వారైనా శిక్షిస్తాం కేటీఆర్

» ఆస్పత్రి వద్ద అర్ధరాత్రి హైడ్రామా

  • విద్యార్థి. గిరిజన, ఇతర సంఘాల ఆందోళన

» సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని

» ప్రిన్సిపాల్, హెచ్ వోడీలను తప్పించాలి.

» హామీ ఇచ్చాకే పోస్టుమార్టం చేయండి.

» ప్రీతి తండ్రి నరేందర్ డిమాండ్

హైదరాబాద్ వరంగల్ లోని కాలేజి (కేఎంసీకి చెందిన కాకతీయ మెడికల్ మొదటి సంవత్సరం(అనస్థీషియా) విద్యార్థిని ధారావత్ ప్రీతి కథ విషాదాంతమైంది. ఐదు రోజులుగా హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడిన ఆమె ఆదివారం. రాత్రి 9.10 గంటలకు తుదిశ్వాస విడిచారు. డాక్టర్ల బృందం ఆమెను కాపాడేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ఆదివారం ఉదయం నుంచే ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు కుటుంబ సభ్యులకు తెలిపినట్లు సమాచారం. శనివారం వరకు ఉన్న కదలికలు ఆదివారం కనిపించలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. తురు నీలం రంగులోకి మారుతోందని ప్రీతి. తండ్రి ఉదయమే ఆవేదన వ్యక్తం చేశారు. మెదడు పనితీరు చాలా వరకు మందగించినట్లు వైద్యులు చెప్పారని. మీడియాకు వివరించారు. ఎంజీఎం అనస్థీషియా విభాగంలో పని చేస్తున్న ప్రీతి తన సీనియర్ ఎంపి సైఫ్ : వేధింపులు భరించలేక ఈనెల 22న ఉదయం మత్తు. వచ్చింది.

జక్షన్ తీసుకుంది. అత్యవసర ఆపరేషన్ థియేటర్లో అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెకు ఎంజీఎంలోనే చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో అదే రోజు నిమ్కు తరలించారు. అప్పటికే ఆమె పనితీరు మందగించడంతో ఎంజీఎంలో సీపీఆర్ నిర్వహించారు. హైదరాబాద్కు తరలించిన తర్వాత రెండుసార్లు నిమ్స్ వైద్యులు కూడా సీపీఆర్ చేశారు. గురువారం కూడా అదే పరిస్థితి ఉండడంతో ఆమెకు మరో రెండుసార్లు సీపీఆర్ నిర్వహించారు. నిమ్స్ కు తరలించే సరికే ఆమె శురంలోని వివిధ అవయవాలు విఫలమయ్యాయని నిమ్స్ వైద్యులు తెలిపారు. మూత్ర పిండాల పనితీరు దెబ్బతినడంతో తొలి రోజు నుంచి దయాలసిస్ చేస్తూ వచ్చారు. శనివారం ఆమె ఆరోగ్యంలో కొంచెం మార్పులు ఉన్నాయని, కదలికలు కనిపిస్తున్నాయని అన్నారు. కానీ ఆదివారం ఉదయం నుంచి ఆరోగ్యం మరింత విషమించినట్లు -సమాచారం. దీంతో ఆమెకు ఆదివారం ట్రెయిన్ టెస్ట్ చేయగా, పనితీరు మరింత మందగించినట్లు వైద్యులు గుర్తించినట్లు సమాచారు. అయితే ఈ విషయాన్ని అధికారంగా వైద్యులు వెల్లడించలేదు. కాగా, నిమ్స్ చేసినప్పటి నుంచీ ప్రీతి ఆరోగ్యం ఏ మాత్రం మెరుగుపడలేదు. ప్రత్యేక బృందం ఆమె ప్రాణాలను కాపాడేందుకు. విశ్వప్రయత్నం చేశారు. ఆమె అవయవాలన్నీ దెబ్బతినడం వల్ల చికిత్సకు మాత్రం స్పందించలేకపోయాయి. ఆరోగ్యం అంతకంతకూ క్షీణిస్తూ వచ్చింది. శనివారం నుంచే ఆమె శరీరం రంగు మారుతూ..ప్రీతి కన్నుమూత

ఈనెల 22న ఉదయం మత్తు ఇంజక్షన్ తీసుకుంది. అత్యవసర ఆపరేషన్ థియేటర్లో అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెకు ఎంజీఎంలోనే చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో అదే రోజు నిమ్స్కు తరలించారు. అప్పటికే ఆమె గుండె పనితీరు మందగించడంతో ఎంజీఎంలో సీపీఆర్ నిర్వహించారు. హైదరాబాద్కు తరలించిన తర్వాత రెండుసార్లు నిమ్స్ వైద్యులు కూడా సీపీఆర్ చేశారు. గురువారం కూడా అదే పరిస్థితి ఉండడంతో ఆమెకు మరో రెండుసార్లు సీపీఆర్ నిర్వహించారు. నిమ్స్క తరలించే సరికే ఆమె శరీరంలోని వివిధ అవయవాలు విఫలమయ్యాయని నిమ్స్ వైద్యులు తెలిపారు. మూత్ర పిండాల పనితీరు దెబ్బతినడంతో తొలి రోజు నుంచి డయాలసిస్ చేస్తూ వచ్చారు. శనివారం ఆమె ఆరోగ్యంలో కొంచెం మార్పులు ఉన్నాయని, కదలికలు కనిపిస్తున్నాయని అన్నారు. కానీ ఆదివారం ఉదయం నుంచి ఆమె ఆరోగ్యం మరింత విషమించినట్లు సమాచారం. దీంతో ఆమెకు ఆదివారం బ్రెయిన్ టెస్ట్ చేయగా, పనితీరు మరింత మందగించినట్లు వైద్యులు గుర్తించినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని అధికారంగా వైద్యులు వెల్లడించలేదు. కాగా, నిమ్స్ చేరినప్పటి నుంచీ ప్రీతి ఆరోగ్యం ఏ మాత్రం మెరుగుపడలేదు. ప్రత్యేక బృందం ఆమె ప్రాణాలను కాపాడేందుకు విశ్వప్రయత్నం చేశారు. ఆమె అవయవాలన్నీ దెబ్బతినడం వల్ల చికిత్సకు ఏ మాత్రం స్పందించలేకపోయాయి. ఆరోగ్యం అంతకంతకూ క్షీణిస్తూ వచ్చింది. శనివారం నుంచే ఆమె శరీరం రంగు మారుతూ చేల్చింది. నిమ్స్ వద్ద అర్ధరాత్రి హై డ్రామా…

నిమ్స్ లో ఆదివారం రాత్రి ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థి సంఘాలు, గిరిజన, ఇతర సంఘాల నేతలు, బీజేపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో నిమ్స్కు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థి సంఘాల నేతలు, పోలీసులు మధ్య తోపులాట జరిగింది. వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ ప్రీతి తండ్రి నరేందర్, సీతారాంనాయక్లతో చర్చించారు. కాకతీయ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్, హెచ్ వోడీ, ఏసీపీ బోనాల కిషన్ నిర్లక్ష్యం వల్లే ప్రీతి చనిపోయిందని తండ్రి సరేందర్ ఆరోపించారు. వెంటనే వారిని సస్పెండ్ చేసినట్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రిన్సిపాల్, హెచ్ వోడీలు పదవిలో ఉంటే తమకు న్యాయం జరగదని అన్నారు. కేసును సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తన కూతురు ఇంజక్షన్ తీసుకోలేదని చెప్పారు. వరంగల్ ఆస్పత్రిలోనే ఏదో చేశారని అనుమానం వ్యక్తం చేశారు. మృతిచెందిన అమ్మాయిని తెచ్చి డ్రామా చేశారా..? అని ప్రశ్నించారు. సైఫ్ డిగ్రీ పట్టాను శాశ్వతంగా రద్దుచేయాలని, అతనితో పాటు మరో 7గురిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చేవరకు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తీసుకువెళ్లనివ్వబోమని కుటుంబసభ్యులు తేల్చి చెప్పారు. దీంతో ఆర్ సీయూలో నుంచి బయటకు తీసుకువచ్చిన ప్రీతి మృతదేహాన్ని వైద్యులు లోపలికి తీసుకెవెళ్లారు. అర్ధరాత్రి దాటినా ఆందోళన కొనసాగింది. దోషులను శిక్షించాలి: రేవంత్

ప్రీతి మృతిపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రీతి మృతి బాధాకరమని, దీనిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు దీకే అరుణ డిమాండ్ చేశారు. ర్యాగింగ్ను నియంత్రించలేని కేసీఆర్ ప్రభుత్వం ఈ మృతికి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. సైఫ్పై హత్య కేసు నమోదు చేయాలన్నారు. ప్రీతి ఆత్మహత్యకు కారకుడైన సైఫ్పై కఠిన చర్యలు తీసుకోవాలని జాతీయ ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేశామని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి తెలిపారు. ప్రీతి మృతి పట్ల వైఎస్సార్టీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేసును సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇది ముమ్మాటికీ హత్యే : బండి సంజయ్

ప్రీతి మరణం బాధాకరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఇది ముమ్మాటికీ హత్య అని, ఫిర్యాదు చేయగానే ప్రభుత్వం వట్టించుకోకపోవడం వల్లే దారుణం జరిగిందన్నారు. ఘటనపై ఇప్పటి దాకా సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించలేదని నిలదీశారు. బీఆర్ఎస్, ఎంఐఎం మద్దతుంటే నేరగాళ్లు ఏం చేసినా చెల్లుతుందని ప్రీతి ఘటన నిరూపిస్తోందన్నారు. ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రీతి విషయంలో అన్ని వ్యవస్థలు విఫలమయ్యాయని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఆదివారం ఆయన నిమ్స్ లో ప్రీతిని పరామర్శించారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

జీవన్ రెడ్డి మాల్స్ పై ఆర్. టి. సి గుస్స…45 కోట్ల కిరాయి బాకీ కట్టాలని నోటీసులు..

ఆర్మూర్, తెలంగాణ: వార్త ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసీ స్థలంలో నిర్మించిన జీవన్ రెడ్డి మాల్స్ లో...

జనరల్

ప్రధానిని కలిసిన మాజీ ఎంపీపీ జివి రమణ రావు..

ప్రధాని మోడీని కలిసిన మాజీ ఎంపీపీ జివి రమణ రావునిర్మల్ ,బైంసా తెలంగాణ వార్త నిర్మల్...

జనరల్

శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఐఏఎస్ అధికారిణి

తెలంగాణ శాసనసభ ఎన్నికలు 2023 నేపథ్యంలో ఈ రోజు శ్రీమతి. భారతి హోలికేరి గారు, ఐఏఎస్,...

జనరల్

బోజా రెడ్డి వైపే ముధోల్ ప్రజల చూపు…

భైంసా ముధోల్ ముధోల్ ముధోల్ మండల నియోజకవర్గంలో బిజెపి టికెట్ ఆశించిన వారిలో బద్దం బోజా...

You cannot copy content of this page