నిజామాబాద్ (తెలంగాణ వార్త) తెలంగాణ మున్సిపల్ మంత్రి తారకరామారావు తన తనయుడి పై తీన్మార్ మల్లన్న వ్యంగ్యంగా మాట్లాడడని తన అనుచరులతో తీన్మార్ మల్లన్న పై దాడి చేయడాన్ని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్రంగా మండిపడ్డారు దమ్ముంటే రాజకీయంగా గా ఎదుర్కోవాలని ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసి తీన్మార్ మల్లన్న అణగదొక్కాలని అనుకుంటే ఊరుకునేది లేదని అరవింద్ అన్నారు రోజు డ్రగ్స్ తీసుకున్న నీవు ఎప్పుడు డు ఏమి మాట్ట్లాడుతావు నీకే తెలియదని డ్రగ్స్ తీసుకున్న మత్తులో ఉండి ఎవరిమీద ఏమి మాట్లాడతావ్ తెలియని సోయి కెళ్ళి తీన్మార్ మల్లన్న దాడి చేయించడం అతని కార్యాలయం ధ్వంసం చేయడం సరికాదన్నారు .డ్రగ్స్ తీసుకునే నీవు రేవంత్ రెడ్డి ఇచ్చిన ఛాలెంజ్ కు ఎందుకు ముందుకు రావడం లేదని రేవంత్ రెడ్డి తన నెత్తి వెంట్రుకలు నీ వెంట్రుకలు అంటే డీఎన్ఏ టెస్ట్ పంపుదామని ఛాలెంజ్ విసరగా ఎందుకు వెనుక వెళ్లినట్టు అని ఆయన సూటిగా ప్రశ్నించారు. విదేశాలకు వెళ్లి డ్రగ్స్ తీసుకొని ఎప్పుడూ మత్తులో ఉంటావని ఎంపీ పేర్కొన్నారు ధైర్యముంటే రేవంత్ రెడ్డి కేటీఆర్ ఇద్దరు డీఎన్ఏ టెస్ట్ చేయించుకుని నిజంగా డ్రగ్స్ ఎవరు వాడుతారు తేలిపోతుందని ఎంపీ అరవింద్ అన్నారు .డ్రగ్స్ తీసుకునే అలవాటు లేకపోతే డిఎన్ఏ టెస్ట్ కు ఎందుకు వెనుకకు వస్తున్నట్టు అని ఆయన ఎద్దేవా చేశారు మరోసారి ఇలాంటి వేషాలు వేస్తే ఊరుకునేది లేదని తప్పనిసరి చర్యలు తీసుకుంటామని ఎంపీ అరవింద్ అన్నారు.
Leave a comment