(తెలంగాణ వార్త) రాజన్న సిరిసిల్ల పర్యటనలో మంత్రి కేటీఆర్ కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. వేములవాడలో పర్యటించిన మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.తనకు షుగర్ ఉందని సీక్రెట్ రివీల్ చేశారు. తాను షుగర్ పరీక్షలు చేసుకోవడం వల్ల 16 ఏళ్ల క్రితమే తనకు ఈ విషయం తెలిసిందని కేటీఆర్ తెలిపారు. దీంతో అప్పటి నుండి జాగ్రత్తగా ఉంటున్నట్లు పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ తనకు షుగర్ ఉందని చెప్పడంతో అక్కడున్న వాళ్లంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారుఇంటింటికి వచ్చి పరీక్షలు చేస్తారని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. హైట్, వెయిట్, బీపీ, షుగరు, హార్డ్, కిడ్నీ, ఇతరత్రా డేటాను అధికారులు ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారని తెలిపారు. అక్కడే కంటి పరీక్ష కూడా చేస్తారన్నారు. అలాగే రక్ష పరీక్షలు చేస్తారని.. రాబోయే 60 రోజుల్లో పరీక్షలు పూర్తి అవుతాయన్నారు. హెల్త్ ప్రొఫైల్ కార్డు ఉండటం వల్ల అన్ని రకాలుగా ఉపయోగపడుతుందని.. ఏ దవాఖానాకు వెళ్లినా డేటా క్లియర్గా ఉంటుందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
మరోవైపు ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో అభివృద్ధి పరంగా దూసుకుపోతోందని వ్యాఖ్యానించారు. అర్హులైన అందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు. ఎవరికైనా విమర్శలు చేయడం సులభంగానే ఉంటుందని.. కానీ పనిచేసినప్పుడే చేసిన ఆ కష్టం విలువ తెలుస్తుందని అభిప్రాయపడ్డారు. మీరు పరిపాలించే రాష్ట్రాలలో ఎప్పుడైనా ఇలాంటి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టించి ఇచ్చారా అంటూ బీజేపీ, కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.
Leave a comment