నందిపేట్, తెలంగాణ వార్త :నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండల కేంద్రంలో మహప్రవక్త ముహమ్మద్ 82యొక్క జన్మదిన సందర్బంగా మిలాద్ కమిటీ మరియు ఆహ్లలే సున్నతుల్ జమాత్ అద్వర్యం లో ముస్లింలు మిలాదున్ నబీ వేడుకలను ఆదివారం ఘనంగా జరుపుకున్నారు….
బర్కత్ పుర లోని ఇబ్రహీం మస్జిద్ నుండి ప్రారంభమైన ర్యాలీ పచ్చ జెండాలు చేతబట్టిన ముస్లిం సోదరులు ఘనంగా ర్యాలీ నిర్వహించి ప్రధాన వీధుల గుండా వెళ్లి మజీద్ రహమనియా వద్ద విరమింపజేశారు.
ఈ సందర్బంగా ముస్లిం మత పెద్దలు మాట్లాడుతు
మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లహు అలైహి సలాం పుట్టిన రోజును పురస్కరించుకొని ముస్లింలు ఈ మిలాద్ ఉన్ నబి పండుగను జరుపుకుంటారని తెలిపారు.
మానవ మహోపకారి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం 1500 సంవత్సరం క్రితం ఇస్లామిక్ క్యాలెండర్ హిజ్రీ రబ్బిల్ అవ్వల్ 12వ తేదీ నాడు మక్కా నగరంలో జన్మించారని , సత్య సందేశాన్ని ప్రజలకు చేరవయడానికి చేసిన కృషి అపూర్వం అని ప్రవక్త త్యాగాలను కీర్తించారు. దేవుడు ఒక్కడే మనుషులంతా ఒక్కటే అనే ఏకైక నినాదంతో 23 ఏళ్ల వ్యవధిలోనే అరబ్ సమాజాన్ని ఆ తర్వాత మొత్తం ప్రపంచాన్ని సన్మార్గం వైపు నడిపారని అన్నారు. పగతో సాధించలేనిది కరుణ ప్రేమతో మహానుభావుడు సాధించి చూపారన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు సల్లం చెప్పిన దేవుని ఏకత్వం నినాదం తోనే ఈ రోజు పేద ధనిక అందరిని పక్కపక్కనే నిలబడి నమాజ్ చదువుతున్నారని ఇస్లాం సమానత్వన్ని కొనియాడారు .
తల్లి పాదాల క్రింద స్వర్గం ఉందని చెప్పి మాతృమూర్తి గొప్పతనాన్ని చాటిన ప్రవక్త అడుగుజాడల్లో నడిచి తల్లిదండ్రుల సేవ ద్వారా స్వార్గం పొందాలని వక్తలు కోరారు. మహనీయ ప్రవక్త జీవిత చరిత్ర ప్రపంచ ముస్లింలకే కాదు సమస్త మానవులందరికీ మార్గదర్శకం అని, ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు మహమ్మద్ ప్రవక్త బోధనాలు పరిష్కారం చూపిస్తున్నాయని వివారించారు. భూమిపై ఉన్న వారిపై దయ చూపిస్తే ఆకాశం లో ఉన్న అల్లాహ్ తమపై దయ చూపుతాడు అని ఆయన మార్గంలో నడవడం మానవులందరికి శ్రేయస్కరం అని ప్రసంగించారు. రహమానియా మజీద్ అధ్యక్షుడు షేక్ బాబు , ఇబ్రహీం మజీద్ అధ్యక్షుడు మహమూద్, మిలాద్ కమిటీ సభ్యులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
Leave a comment