నందిపేట్, తెలంగాణ వార్త:: నందిపేట మండలం తల్వెద గ్రామ శివారు లో ఆదివారం టాస్క్ ఫోర్స్ పోలీసు బృందం పేకాట స్థావరంపై దాడి చేసి ముగ్గురు వ్యక్తులను పత్తలాడుతుండగా పట్టుకుంది. దొడ్డికింది సాయి రెడ్డి, బుద్ధన్నగారి లింగారెడ్డి, కొట్టాల లింగారెడ్డిలను అరెస్టు చేసి 15,100రూ:ల నగదును స్వాధీనం చేసుకోవడం జరిగిందని, జూదం ఆడడం చట్టరీత్య నేరమని ఎవరైనా జూదమాడుతూ ఉంటే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాలని వెంటనే అటువంటి వారిపై చర్య తీసుకుంటామని, జూదమే కాకుండా అసాంఘిక కార్యకలాపాలకు ఎవరు పాల్పడిన, చర్యలు తప్పవని ఎస్సై హరిబాబు హెచ్చరించారు.
9440023558
Leave a comment