నందిపేట్., తెలంగాణ వార్త
నందిపేట్ మండలంలో బస్ డిపో ఏర్పాటు కోసం సోమవారం చేపట్టాల్సిన మహా ధర్నా, పోలీస్ అనుమతి రాకపోవడంతో రద్దు చేయడం జరిగిందని డిపో నిర్మాణ కార్య చరణ కమిటీ కన్వీనర్ సాంబారు గిరిధర్ పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ అంశంపై గ్రామ గ్రామాలకు వెళ్లి యూత్ అసోసియేషన్లు, వి.డి.సి
సభ్యులు, మహిళా సంఘాలతో సంప్రదింపులు జరిపి ఉద్యమ కార్యచరణను తుది రూపకల్పన చేస్తామని వెల్లడించారు.
Leave a comment