Home జనరల్ నాన్న పడే కష్టం కొడుకులు కూతుళ్లకు తెలవాలి….
జనరల్

నాన్న పడే కష్టం కొడుకులు కూతుళ్లకు తెలవాలి….

😪 నాన్న కూ కన్నీళ్లు ఉంటాయి👨‍👩‍👧‍👦

😪 నాన్న మనకోసం ఏం చేశాడో*
ఏం కోల్పో యాడో మనకు తెలియదు..!*

😪 జీవితాంతం పిల్లల కోసం తపిస్తూ, వారి అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తి తండ్రి తన పిల్లల కోసం జీవితంలో ఎన్నో కోల్పోతాడు. నాన్న మన కోసం ఏం చేశాడో మనకు తెలియదు. ఎన్ని కష్టాలు పడ్డాడో తెలియదు.

😪 ఎందుకంటే.. నాన్న ఎవరికీ చెప్పడు. పిల్లలకి, భార్య కి అసలు చెప్పడు. అమ్మ లా ప్రేమ ను బయటికి చూపించడం నాన్న కు రాదు. నాన్న ఇంటికి ఎప్పుడో వస్తాడు, వెళ్లిపోతాడు. బిజీగా ఉన్న నాన్న రాత్రిపూట ఇంటికి వచ్చి మంచం మీద ఎదుగుతున్న పిల్లల్ని చూస్తుంటాడు.*

😪 ఎప్పుడూ పనేనా ? కాస్త ఇంటి దగ్గర ఉండొచ్చుగా..’ అని చిరాకు పడుతున్న అమ్మ మాటలు వింటుంటాం. పిల్లలు కూడా నాన్నను మిస్‌ అవుతుంటారు. నిజానికి నాన్నను నాన్నే మిస్‌ అవుతుంటాడు. పెళ్లై, పిల్లలు పుట్టగానే నాన్న జీవితం నాన్న చేతుల్లో ఉండదు.

😪మనందరి కోసం నాన్న రాత్రి, పగలు పనిచేయాలి. చదువులు, సమస్యలు, బంధువులు, పండగలు, బర్త్‌డేలు, ఆసుపత్రులు.. వీటన్నింటితో నాన్న నలిగిపోతుంటాడు. ఆయనకు ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. వృద్ధాప్యం వల్ల అని పిల్లలు అనుకుంటారు.
😪 వృద్ధాప్యం ఇంకా రాలేదు.. మీ కోసం అనుక్షణం కరిగిపోతూ, కాలిపోతున్న నాన్నకి లోపల ఆరోగ్యం ఎంత దెబ్బ తింటోందో తెలియదు. నాన్న డాక్టర్‌ ను కలిసిన విషయం కూడా మనకు తెలియదు. ఎందుకంటే.. ఆ రిపోర్ట్‌లు తీసుకుని ఇంటికి రాడు.*

😪 తన పిల్లలు గొప్ప వాళ్లు అవుతారని నాన్న కు విపరీతమైన నమ్మకం. అందుకే అప్పులు చేసి చదివిస్తాడు. ఆఫీసుకు సెలవు పెట్టి, స్కూల్‌లో పిల్లల సీటు కోసం లైన్‌లో నిల్చుంటాడు. మీరు పరీక్ష రాస్తుంటే బయట రోడ్డు పక్కన ఎండలో నిల్చుని ఉంటాడు. పిల్లలు ఏదో సాధించేస్తారని ఆశ.

😪 ఆస్తులు అమ్మేసి కూతురి పెళ్లి ఘనంగా చేస్తాడు. ఎక్కడ, ఎన్ని సంతకాలు పెడతాడో మనకు తెలియదు. కొన్ని వందలసార్లు అమ్మ ఏడ్వడం చూశాం కానీ, నాన్న ఏడ్వడం ఎప్పుడైనా చూశారా? నాన్న కూడా ఏడుస్తాడు.😰 కానీ మీ ముందు ఏడ్వడం ఆయనకు ఇష్టం ఉండదు. ఎక్కడో ఒంటరిగా కూర్చుని ఏడుస్తాడు.*

😪పిల్లలు పెద్దయి, ఏదో పని చేసుకునే సమయానికి.. నాన్న అన్నీ అమ్ముకుని, అంతా ఆరిపోయి, అంతంత ఆరోగ్యంతో మిగిలిపోతాడు. అప్పుడే పిల్లలు నాన్నకు ఎదురు చెప్పడం మొదలు పెడతారు. ‘ఇన్నాళ్లూ వీళ్ల కోసం ఇంత చేశానా?, నేను ఎవరి కోసం బతికాను?’ అనే ఆలోచనలు నాన్నకు వస్తాయి. నా కోసం నేను ఏదీ దాచుకోలేదే…. అనుకుంటాడు.*

😪నిజానికి నేను అనే ఆలోచన అప్పటి వరకు నాన్నకు తెలియదు.

ప్రతి నాన్న కు
🙏😌🙏

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

నేడే వాహనాల వేలంపాట – మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వివేకానంద రెడ్డి వెల్లడి..

ఆర్మూర్, తెలంగాణ వార్త:: నేడు నిర్వహించబడబోయే వాహనాల వేలంపాటకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని మోటార్ వెహికల్...

జనరల్

67 వారానికి చేరుకున్న జర్నలిస్ట్ కాలనీ స్వచ్ఛ కాలనీ కార్యక్రమం…

ఆర్మూర్, తేలంగాణ వార్త::ఆదివారం జర్నలిస్ట్ కాలని అభివృద్ధి కమిటి అధ్యక్షులు సుంకె శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన...

జనరల్

పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి…..

ఆర్మూర్, తెలంగాణ వార్త :: ఆర్మూర్ మండలంలోని పిప్రీ గ్రామంలో పిప్రీ ఆరోగ్య ఉప కేంద్రo...

జనరల్

సీజ్ చేసిన వాహనాల ను ఈనెల 29న వేలం వేయనన్నట్టు తెలిపిన వెహికల్ ఇన్స్పెక్టర్ గుర్రం వివేకానంద రెడ్డి…

తెలంగాణ వార్త, ఆర్మూర్::: గత కొన్ని సంవత్సరాలుగా రవాణా శాఖ అధికారులు సీజ్ చేసి వివిధ...

You cannot copy content of this page