ఆర్మూర్ ,తెలంగాణ వార్త: గాయత్రి బ్యాంకు ఆర్మర్ శాఖ యొక్క ఖాతాదారులైన బొడ్డు గోపాల్ ప్రమాదవశాత్తు మరణించగా, మృతుడికి ది గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు యందు గల గాయత్రి నిర్బయ సేవింగ్ ఖాతాపై గల ప్రమాదభీమా సౌకర్యం ద్వారా అతని భార్య అయిన బొడ్డు మాదవి కి 1లక్ష రూపాయల చెక్కును ఆర్మూర్ ఆర్ డిఒ శ్రీ శ్రీనివాస్ మరియు బ్రాంచి మేనేజర్ శ్రీ శ్రీరామోజి లింబాద్రి చేతులమీదుగా అందజేశారు.ఈ సందర్భంగా ఆర్మూర్ ఆర్ డి ఒ శ్రీ బి. శ్రీనివాస్ మాట్లాడుతు మధ్యతరగతి వ్యాపార, ఉద్యోగ వర్గ ప్రజలకు ఋణాలను ఇస్తున్నారని, నామమాత్రపు చార్జీలతో లక్ష రూపాయల ప్రమాదబీమా ద్వారా ఖాతాదారుల కుటుంబాలకు మా వంతు బాధ్యతని నిర్వర్తించగలుగుతున్నారని అన్నారు. కేవలం 9% సాలుసరి వడ్డీకే బంగారు ఆభరణాలపై గ్రాముకు అత్యధికంగా రూ॥3,400/- తో ఋణాలను అందిస్తున్నారని, అలాగే వినియోగదారులకు 24 గంటలు ఏటీఎం లలో నగదు అందుబాటులో ఉంచడం ద్వారా ఆర్మూర్ మరియు పరిసర ప్రాంత ప్రజల నగదు అవసరాలను తీరుస్తున్నారని అన్నారు.అనంతరం బ్రాంచి మేనేజర్ శ్రీ శ్రీరామోజి లింబాద్రి మాట్లాడుతూ వినియోగదారులకు మైక్రో ఏటీఎం ఏ సి పి ఎస్ సేవల ద్వారా వినియోగదారులకు చెల్లింపులు చేయడం జరుగుతుంది. ఏ సి పి ఎద్వారానే ఖాతా ఓపెన్ చేయడం జరుగుతుంది. మరియు సేవింగ్ ఖాతాలు ప్రారంభించుటకు కావలసిన ఫోటో మరియు జిరాక్స్లను బ్యాంకు యందే ఉచితంగా అందిస్తున్నామని, వ్యాపారస్తులకు వ్యాపార వృద్ధికై ఋణాలను అందిస్తున్నామని, ఆర్మూర్ పరిసర గ్రామాలలో 17 బ్యాంకింగ్ కరస్పాండెంట్లను నియమించామని, తద్వారా పెన్షనర్లు మరియు ఇతర ఖాతాదారులు ఇట్టి బ్యాంకింగ్ కరస్పాండెంట్ల వద్ద బ్యాంకు లావాదేవీలను నిర్వహించుకోవచ్చని తెలియజేశారు.
Leave a comment