కూకట్ పల్లి, తెలంగాణ వార్త: కూకట్ పల్లి జెఎన్టియు హెచ్ లో సీనియర్ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న ప్రమోషన్లు రావడంలేదని ప్రొఫెసర్లు డి.వసుమతి, యమ్ సుష్మ తెలిపారు.
విలేకరుల సమావేశంలో సీనియర్ ప్రొఫెసర్లు మాట్లాడుతూ తాము 20 సంవత్సరాలుగా జేఎన్టీయూహెచ్ లో పనిచేస్తున్నామని ఇప్పటివరకు తమకు ప్రమోషన్లు ఇవ్వడం లేదని ఈ విషయం జేఎన్టీయూ రిజిస్టర్ మంజూరు హుస్సేన్ కు వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లగా వినతిపత్రం తీసుకోలేదని విసీ కి నచ్చితే తమకు ప్రమోషన్లు వస్తాయని రిజిస్టర్ తెలిపినట్టు ప్రొఫెసర్లు తెలిపారు. కేవలం తాము దళితులం కాబట్టి తమకు ప్రమోషన్ ఇవ్వడానికి వారికి సిగ్గుగా ఉన్నట్టు తెలుస్తుందని ప్రమోషన్లకు దళిత కులం పనికిరాదా అన్న రీతిలో విసీ కట్టా నరసింహారెడ్డి ప్రవర్తిస్తున్నారని తాము ఎక్కువగా మాట్లాడితే ఇక్కడి నుండి ట్రాన్స్ఫర్ చేస్తారని తమకు ఇట్టే తెలుస్తుందని వారు వా పోయారు. 20 సంవత్సరాలుగా ప్రమోషన్ లేక చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందని వీరు పత్రిక ముఖంగా తెలిపారు. ప్రమోషన్లు రాక తమలాంటి దళిత ప్రొఫెసర్లు చాలామంది ఉన్నారని వారు చెప్పడానికి భయపడుతున్నారని వీరు పేర్కొన్నారు.
94400 23558
Leave a comment