Home జనరల్ స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావాలి – రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి..
జనరల్

స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావాలి – రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి..

     
 రంగారెడ్డి జిల్లాలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, అధికారులకు దిశానిర్దేశం చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి

     తెలంగాణ వార్త: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అన్ని విధాలుగా సమాయత్తం కావాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారథి సూచించారు. ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రక్రియ ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. 
     గురువారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి జిల్లా కలెక్టర్లు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, జెడ్పీ సీఈఓలు, డీపీఓలు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి మాట్లాడుతూ, వచ్చే నాలుగైదు నెలల వ్యవధిలో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ముందుగా మూడు దశలలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని, అనంతరం ఎంపీటీసీ, జెడ్పిటీసీ ఎన్నికలు, చివరగా మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయని వెల్లడించారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై పకడ్బందీగా దృష్టిని కేంద్రీకరించాలని, జిల్లా ఎన్నికల అధికారులైన కలెక్టర్లు ఏర్పాట్లను నిశితంగా పర్యవేక్షణ జరపాలని సూచించారు. శాసన సభ, పార్లమెంటు ఎన్నికలతో పోలిస్తే, పార్టీలకు అతీతంగా జరిగే స్థానిక సంస్థల ఎన్నికలు సున్నితత్వంతో కూడుకుని ఉంటాయని, ఏమాత్రం అజాగ్రత్తకు తావివ్వకుండా, ఎలాంటి ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా ఎన్నికలను నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కమిషనర్ హితవు పలికారు. ఓటరు జాబితా రూపకల్పన, పోలింగ్ కేంద్రాల మ్యాపింగ్ వంటి ప్రక్రియలను తక్షణమే చేపట్టి నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలన్నారు. సెప్టెంబర్ 6న ఓటరు జాబితా డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వెలువరించి అభ్యంతరాలు స్వీకరించాలని, సెప్టెంబర్ 21 న తుది ఓటరు జాబితాను వెలువరించాల్సి ఉంటుందన్నారు. తుది ఓటరు జాబితాను వెలువరించడానికి ముందే క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని, ఏవైనా మార్పులు, చేర్పులకు సంబంధించిన అభ్యర్థనలు వస్తే వాటిని పరిశీలించి ఓటరు జాబితాలో చేర్చే అధికారం కేవలం ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు. ఏ చిన్న పొరపాటుకు కూడా ఆస్కారం లేకుండా ప్రతీ దశలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని, నిర్లక్ష్యానికి తావివ్వకూడదని జాగ్రత్తలు సూచించారు. పంచాయతీరాజ్ చట్టం-2018 తోపాటు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించిన నిబంధనలపై పూర్తి అవగాహన ఏర్పరచుకోవాలని, ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు క్రియాశీలక పాత్ర పోషించాలని తెలిపారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఉన్న ఓటరు జాబితాను గ్రామ పంచాయతీల వారీగా రూపొందించుకోవాలని, అర్హులైన ఏ ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుండి గల్లంతు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై చర్చించాలని అన్నారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తిస్తూ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో, పూర్తి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిపించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఎన్నికల కమిషనర్ పార్థసారథి సూచించారు. ఎంపిడిఓలు తమతమ మండలాల పరిధిలోని పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో సందర్శించి వాటి స్థితిగతులను పరిశీలించేలా చూడాలన్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రం పరిధిలో 600 వరకు ఓటర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఓటర్ల సంఖ్య 650 దాటితే అదనపు పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు. ఒక వార్డులోని ఓటరుకు మరో వార్డులో ఓటు హక్కు ఉండకుండా జాగ్రత్త వహించాలని, ఒకే కుటుంబానికి చెందిన ఓటర్ల ఓటు ఒకేచోట ఉండేలా ఓటరు జాబితాను నిశితంగా పరిశీలించాలని అన్నారు. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, ప్రతిఒక్కరు తమతమ విధులను సమర్ధవంతంగా నిర్వహించాలని, అలసత్వాన్ని ఎంతమాత్రం ఉపేక్షించబోమని కమిషనర్ స్పష్టం చేశారు. బ్యాలెట్ బాక్సులు, ఇతర ఎన్నికల సామాగ్రిని సమకూర్చుకోవాలని, ఎన్నికల నిర్వహణ కోసం అవసరమైన  పోలింగ్ సిబ్బందిని గుర్తించి, వారికి శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలని, ర్యాండమైజెషన్ ద్వారా పోలింగ్ కేంద్రాలలో విధులను కేటాయించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లా పంచాయతీ కార్యాలయాలతో పాటు మండల స్థాయిలోనూ ప్రత్యేకంగా ఎలక్షన్ సెల్ లను నెలకొల్పి, ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను పర్యవేక్షించేలా చూడాలని ఎన్నికల కమిషనర్ సూచించారు. 
     ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ మాట్లాడుతూ తమరి సూచనలను పాటిస్తూ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించిన నిబంధనలపై పూర్తి అవగాహనతో సర్వం సిద్దం చేస్తామని తెలిపారు. ఓటరు జాబితా రూప కల్పన, పోలింగ్ కేంద్రాల మ్యాపింగ్ వంటి ప్రక్రియలను తక్షణమే చేపట్టి నిర్ణీత గడువులోపు పూర్తి చేస్తామని తెలిపారు. ఎన్నికల నిర్వహణ కోసం అవసరమైన పోలింగ్ సిబ్బందిని గుర్తించి, వారికి శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తామని, ర్యాండమైజెషన్ ద్వారా పోలింగ్ కేంద్రాలలో విధులను కేటాయించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.

ఈ సమావేశంలో పంచాయతీ అధికారి సురేష్ మోహన్, ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంత్ రెడ్డి, కందుకూర్ ఆర్డీఓ సూరజ్ కుమార్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

వార్త ఆగదు నిజం దాగదు 9440023558

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

తగ్గేదేలే! సిసీ కెమెరాలు జాన్తే నై దొంగతనం చేసుడు చేసుడే. పోలీసులకు సవాల్ విసురుతున్న దొంగలు..

తెలంగాణ వార్త:: ఆర్మూర్ లోని పాత బస్టాండ్ లో గల దోండి మెడికల్ హల్ లో...

జనరల్

పెర్కిట్ వద్ద వాహనం ఢీ ఒకరి మృతి..

ఆర్మూర్, తెలంగాణ వార్త: ఆదివారం ఉదయం 6:10 గంటలకు, NH44 లోని రిలయన్స్ పెట్రోల్ పంప్...

జనరల్

బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేసిన పైడి రాకేష్ రెడ్డి..

ఆర్మూర్, తెలంగాణ వార్త:: డొంకేశ్వర్ మండలం లో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సోమవారం డొంకేశ్వర్...

జనరల్

తగ్గేదే లే దన్న కమిషనర్ సి డి ఎం ఏ కు సరెండర్ అయినా మేనేజర్..

ఆర్మూర్ తెలంగాణ వార్త:: ఆర్మూర్ పట్టణ మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ మేనేజర్ మధ్య చెలరేగిన చిచ్చులో...

You cannot copy content of this page