తెలంగాణ వార్త ,నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం రామచంద్రపల్లి జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పెర్కిట్ కి చెందిన పుచ్చుల సుమన్(35) ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. నిజామాబాద్ నుంచి ఆర్మూర్ కు బైకుపై వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే ప్రమాదం ఎలా జరిగిందనేది తెలియాల్సి ఉంది. పెర్కిట్ కు చెందిన సుమన్ తూనికలు, కొలతల శాఖలో పనిచేస్తున్నాడు. కాగా సుమన్ తండ్రి ప్రభుత్వ టీచర్ హన్మాండ్లు సైతం రెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా కారుణ్య నియామకంలో భాగంగా ఐదు నెలల క్రితం సుమన్ ఉద్యోగంలో చేరాడు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు.

Leave a comment