హైదరాబాద్రా, తెలంగాణ వార్త:: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతో కాలంగా వేచి చూస్తున్న డీఏ బకాయిల పైన ముఖ్యమంత్రి రేవంత్ ఈ రోజు కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం రేవంత్ చర్చల తరువాత ఈ సాయంత్రం లోగా డీఏ బకాయిల పైన నిర్ణయం ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. దీపావళి కానుక గా ఉద్యోగులకు పెండింగ్ ఉన్న అయిదు డీఏల్లో రెండు విడుదల చేయనున్నట్లు సమాచారం
రేవంత్ కీలక నిర్ణయం
ముఖ్యమంత్రి రేవంత్ ఈ రోజు ఉద్యోగులకు తీపి కబురు ప్రకటించనున్నారు. తాజాగా ఉద్యోగ సంఘాల నేతలు సీఎం రేవంత్ తో సమావేశమయ్యారు. అనేక అంశాల పైన చర్చించారు. రాష్ట్ర ఆర్దిక పరిస్థితి గురించి ముఖ్యమంత్రి వివరించారు. ఉద్యోగుల సమస్యల పైన మంత్రివర్గ ఉప సంఘం చర్చించి..ఆర్దికేతర అంశాలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వచ్చే ఆర్దిక సంవత్సరం ఆరంభం నుంచి ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను విడుదల చేస్తామని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో అయిదు డీఏలు బకాయి ఉన్న అంశాన్ని ఉద్యోగ సంఘాలు ముఖ్యమంత్రికి వివరించాయిడీఏల పై చర్చ
చర్చల తరువాత ఉద్యోగులకు రావాల్సినవి ఐదు డీఏలు పెండింగులో ఉండగా, గరిష్ఠంగా రెండు డీఏలు ఇచ్చేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. ఉద్యోగుల ఇతర సమస్యలను కూడా చర్చించి, తక్షణ పరిష్కారం చూపేందుకు భట్టి నేతృత్వంలో మరో ఉప సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఇందులో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు సభ్యులుగా, ప్రత్యేక ఆహ్వానితుడిగా ప్రభుత్వ సలహాదారు కేశవరావు ఉంటారు. ఈ సాయంత్రం భట్టి, సీఎస్ తో ముఖ్యమంత్రి సమావేశం తరువాత డీఏల పైన ప్రకటన ఉంటుందని సమాచారం.
Leave a comment