*సికింద్రాబాద్ క్షత్రియ పట్కరి సమాజ్ లో ఘనంగా గణతంత్ర వేడుకలు*
తెలంగాణ వార్త, హైదరాబాద్, సిటీ బ్యూరో.
సికింద్రాబాద్ క్షత్రియ సమాజ్ లో76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఆదివారం అట్టహాసంగా నిర్వహించుకున్నారు. క్షత్రియ సమాజ్ అధ్యక్షుడు గోరఖ్ శివకుమార్ మువ్వన్నెల జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతం ఆలరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 1950లో అమల్లోకి వచ్చి పూర్ణ స్వరాజ్ డిక్టరేషన్ కు గౌరవంగా జనవరి 26 ను అమలుకు ఎంపిక చేశారు అని తెలిపారు. రాజ్యాంగాన్ని దేశ అత్యున్నత చట్టంగా అభివర్ణిస్తూ దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన వారిని జ్ఞాపిక చేసుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని అధ్యక్షులు గోరఖ్ శివ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు ఓంకారి ప్రభు, కార్యదర్శి ట్రంకు శ్యామ్ లాల్, అదనపు కార్యదర్శి దివాన్ వెంకటేష్, కోశాధికారి దగుడు కామేశ్వరరావు, ట్రంకు విష్ణు, సిరిగిరి రామ్ కిషన్ రావు మాజీ అధ్యక్షుడు, దోండి మోహన్, సంఘ సభ్యులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.



Leave a comment