తెలంగాణ వార్త:: మోర్తాడ్ మండలం లోని పాలెం గ్రామంలో ఆర్మూర్ పట్టణం పెర్కిట్ లో గల సిరి హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఆరోగ్య శిబిరం లో 400 మంది తమ ఆరోగ్యాలను పరిశీలించుకున్నారు. ఈ శిబిరంలో పాల్గొన్న వారికి షుగర్, ఈసీజీ, కొలెస్ట్రాల్ మరియు బిఎండి పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. . ఆరోగ్యం పరిశీలించిన వారిలో సిరి హాస్పిటల్ ఎండి డాక్టర్ లింగారెడ్డి, డాక్టర్ శిరీష, డాక్టర్ అజయ్ రెడ్డి, డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ సునీల్, ,డాక్టర్ యశ్వంత్, డాక్టర్ సౌమ్య ఈ శిబిరంలో పాల్గొన్నారు..
Leave a comment