నిజామాబాద్( తెలంగాణ వార్త )వేల్పూర్ మండలంలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వేల్పూరు ఎస్ఐ రాజ్ భరత్. దేశవ్యాప్తంగా కోవిడ్ 19 ఓమి క్రాన్ విజృంభిస్తున్న ఉన్నకారణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్య దృశ్య మాస్కు పెట్టుకోవడం, దూరం దూరం గా మనుషులు కూర్చోవడం, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, ఎప్పుడు చేతులు కడుక్కోవడం, సానిటేషన్ చేసుకోవడం కచ్చితంగా పాటించాలని ఎస్సై రాజ్ భరత్. ప్రభుత్వ ఆదేశానుసారం పైన పేర్కొన్న వాటిని ప్రజలు పాటించకపోతే చట్టరీత్యా చర్యలు తీసుకోబడుతాయని ఎస్ఐ తెలిపారు. కావున వేల్పూరు మండల ప్రజలు పోలీసులకు సహకరించాలని ఆయన పేర్కొన్నారు. వేల్పూర్ మండల ప్రజలు కచ్చితంగా కోవిడ్ 19 నుంచి తమకు తాము కాపాడుకోవాలని లేనియెడల ప్రభుత్వ ఆదేశానుసారం శిక్ష పడుతుందని ఎస్ఐ పేర్కొన్నారు.
Leave a comment