తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి..
ఆర్మూర్, (తెలంగాణ వార్త)
ఆర్మూర్ పట్టణంలో ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో
తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆర్మూర్ మండల బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు గోజూరు మహిపాల్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 191 జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బీసీ సంక్షేమ సంఘం ఆర్మూర్ మండల అధ్యక్షులు గోజూర్ మహిపాల్ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే 1831 జనవరి 3 తేదీన మహారాష్ట్ర రాష్ట్రంలో నిరుపేద రైతు కుటుంబంలో జన్మించి భారతీయ సమాజంలో మహిళలు చదువుకోవడం మహిళలు ఉద్యోగం చేయడం ఆస్తిలో హక్కు కలిగి ఉండడం నిషేధం ఉన్న రోజుల్లో బాలికల చదువు కోసం అనేక అవమానాలు, బెదిరింపులు ఎదుర్కొంటూనే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బాలికల కోసం వసతి గృహాలు ఏర్పాటు చేసి చదువు నేర్పిన భారతీయ మొదటి చదువుల తల్లి సావిత్రిబాయి పూలే అని అన్నారు. అంతేకాకుండా వితంతువులను, మహిళలను, చేరదీసి ఆశ్రయం ఇచ్చి ఆదుకున్న మహిళగా పేరు ప్రఖ్యాతులు గడించారు. నేటి సమాజం సావిత్రిబాయి పూలే ఆదర్శంగా తీసుకొని సావిత్రిబాయి పూలే ఆలోచనతో నేటి యువత ముందుకెళ్లాలని మహిపాల్ అన్నారు..ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు అబ్బ గోని అశోక్ గౌడ్, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఉట్నూర్ సత్య గౌడ్, రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ నర్సింగ్ రావు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రాస శ్యామ్, ఆర్మూరు మండల అధ్యక్షులు గో జూ రూ మహిపాల్, దినేష్, శ్రావణ్, రవి, వినోద్, బట్టు స్వామి, పెర్కిట్ రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.
Leave a comment