మెదక్ (తెలంగాణ వార్త) రోజు కూలి పని చేసుకునే తల్లిదండ్రులు వారం రోజుల క్రితం చికెన్ తీసుకొని వచ్చి వండారు వివరాల్లోకి వెళితే మనోహరాబాద్ మండల కేంద్రానికి చెందిన పోతరాజు అనితకు లక్ష్మీ ప్రియ (11) కిషోర్( 8 )ఇద్దరు పిల్లలు ఉన్నారు .ఏడాదిన్నర క్రితం అనారోగ్యంతో భర్త మృతి చెందాడు. ఇద్దరు చిన్నారులు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 1 ,6 వా చదువుతున్నారు కంపెనీలో కూలిపని చేసుకుంటూ వారిని తల్లి పోషిస్తుంది. గత వారం రోజుల క్రితం రాత్రి చికెన్ వండి ఇద్దరు పిల్లలతో సహా తల్లి తిని పడుకున్నారు. మరుసటి రోజు పిల్లలిద్దరికీ రక్తపు వాంతులు విరేచనాలు అయ్యాయి. స్థానిక ఆర్ఎంపీ చెప్పిన మందులు వాడినా పిల్లలిద్దరికీ తగ్గలేదు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా హైదరాబాద్ లో నీలో పార్క్ వెళ్ళమని వైద్యులు సూచించారు. .నీలోఫర్ చికిత్స పొందుతూ కిషోర్ గత నెల 27న మృతి చెందాడు. కొడుకు అంత్యక్రియలు అయిన రోజే లక్ష్మీ ప్రియ కు మళ్లీ వాంతులు కావడంతో నీలోఫర్ కి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం వచ్చింది అనుమానంతో మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తీసుకో నివైద్యులు పంపించారు. తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మనోహరాబాద్ ఎస్ ఐ రాజు గౌడ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారుల మృతి కి కలుషిత ఆహారమే కారణమా ఎవరైనా కక్షగట్టి చేశారా అని పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
Leave a comment