హైదరాబాద్( తెలంగాణ వార్త) బడ్జెట్ అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులతో చర్చించినట్లు తెలుస్తోంది. సమావేశాల్లో విపక్ష సభ్యుల ప్రశ్నలకు ధీటుగా బదులిచ్చేలా వారికి దిశా నిర్దేశం చేసినట్లు సమాచారం.
తాజా భేటీలో బడ్జెట్తో పాటు రాజకీయ అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేయబోయే కూటమిపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇటీవలి రాంచీ, ఢిల్లీ, ముంబై పర్యటనల వివరాలను మంత్రులతో సీఎం కేసీఆర్ పంచుకున్నట్లు చెబుతున్నారు.
ఇక బడ్జెట్ విషయానికొస్తే.. ఈసారి రాష్ట్ర బడ్జెట్ రూ.2.7 లక్షల కోట్లు దాటే అవకాశం ఉందంటున్నారు. సోమవారం (మార్చి 6) ఉదయం అసెంబ్లీలో ఆర్థిక మంత్రి హరీష్ రావు, శాసనమండలిలో మంత్రి ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. బడ్జెట్లో దళిత బంధు పథకానికి భారీగా నిధులు కేటాయించవచ్చునని చెబుతున్నారు. అలాగే నిరుద్యోగ భృతి పథకానికి కూడా ఈసారి కేటాయింపులు ఉంటాయని అంటున్నారు. వచ్చే ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జనరంజక బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం ఉందంటున్నారు.
ఇక ఈసారి అసెంబ్లీ సమావేశాలు గవర్నర్ ప్రసంగం లేకుండానే ప్రారంభం కానున్నాయి. గతేడాది నిర్వహించిన అసెంబ్లీ సమావేశాలకు కొనసాగింపుగా ఈ సమావేశాలను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిన సంగతి తెలిసిందేప్రగతి భవన్లో తెలంగాణ కేబినెట్ భేటీ కొద్దిసేపటి క్రితం ముగిసింది. భేటీలో బడ్జెట్ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
Leave a comment