తెలంగాణ వార్త:: తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో ఆదివాసి హక్కుల గురించి, ఆదివాసులకు రావలసిన నిధులు గురించి, నిరుద్యోగ యువకుల నియామకాల గురించి, ప్రతిరోజు జరుగుతున్న ఆదివాసి బిడ్డల అవమానాల గురించి, ఆదివాసీల పై జరుగుతున్న అరాచకాన్ని, అక్రమాలను, అరెస్టులను ఎలా ఎదుర్కోవాలని… అభివృద్ధిని ప్రభుత్వ అధికారులతో ఎలా పనిచేయించుకోవాలో నిన్న నిజామాబాద్ జిల్లాలో ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో “ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కరీంనగర్ వరంగల్ ఉమ్మడి జిల్లాల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుర్రం రవీందర్ గారు ముఖ్యఅతిథిగా విచ్చేశారు. వీరితోపాటు తోటి ఆదివాసి జిల్లా కమిటీ మరియు నాయక పోడ్ జిల్లా కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
గంట సాయిలు నందిపేట్ రిపోర్టర్
Leave a comment