సంగారెడ్డి (తెలంగాణ వార్త) పి సి సి చీప్ గా రేవంత్ రెడ్డి నియమించిన నాటినుంచి ఆయన రేవంత్ రెడ్డి పై కాంగ్రెస్ పై చిందులు తొక్కుతున్నాడు. అప్పటినుండి కాంగ్రెస్ పార్టీని వీడేందుకు కారణాలు వెతుకుతూ వస్తున్నాడు కాకపోతే కాంగ్రెస్ను ఎదిరించే పరిస్థితిలో లేకుండాపోయారు. రాజకీయంగా ఆయన కూడా పిసిసి పదవిని ఆశించి బంగా పడ్డారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేయడం లేదని చెప్పడం ద్వారా కాంగ్రెస్ నుంచి బయటపడేందుకు బలమైన కారణాలు వెతుకుతున్నట్లు ఉంది. ఆయన టిఆర్ఎస్ లోకి చేరుతున్న బలమైన సంకేతం రేవంత్ రెడ్డి కార్పొరేట్ ఆఫీస్ తరహాలో పార్టీని నడుపుతున్నారని దీనిలో మరో మతలబు ఉందని పార్టీ నేతలందర్నీ కలుపుకొని పోయి కార్యక్రమాలు నిర్వహించడం లేదని అన్నారు .అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మైండ్ సెట్ మార్చాలని లేదంటే కాంగ్రెస్ లైన్ లో పని చేసేది మరో నాయకుడిని కొత్త అధ్యక్షుడిగా నియమించాలని సంగారెడ్డి ఎమ్మెల్యే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట జగ్గారెడ్డి కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరడంలో కూడా పెద్ద కారణాలు కానరావడం లేదు. జగ్గారెడ్డి తీరుతున్న అధిష్టానం గతంలో అతడిని దూరం పెట్టింది గతంలో ఓ మారు ఎంపీ టికెట్ కోసం బిజెపిలో కూడా చేరిన జగ్గారెడ్డి రాజకీయంగా తనకు అవసరమైన మార్గాన్ని ఎన్నుకుంటారు అన్న వాదన ఉంది. ఇదిలా ఉంటే కేటీఆర్ జగ్గారెడ్డి సంగారెడ్డి నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జి చింత ప్రభాకర్ కలవరపెడుతోంది 2018 ఎన్నికల్లో జగ్గారెడ్డి స్వల్ప మెజార్టీతో టిఆర్ఎస్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే అయినా చింత ప్రభాకర్ పై విజయం సాధించారు. ఆ తర్వాత జగ్గా రెడ్డి కాంగ్రెస్ నుండి కార్యకారణ ప్రచారం సాగింది అయితే టీపీసీసీ చీఫ్ రేవంత్ తో ఉన్న విభేదాలు ఈ నేపథ్యంలో జగ్గారెడ్డి టి ఆర్ ఎస్ లో చేరేందుకు సిద్ధమైనట్టు తెలిసింది. తాజాగా రేవంత్ రెడ్డి కి వ్యతిరేకంగా లేఖ రాయడంతో ఇప్పటి చర్చకు బలం చేకూరింది .ఆయన ఏ క్షణంలోనైనా టిఆర్ఎస్ లో చేరడం ఖాయమని అనుచరులు చర్చించుకుంటున్నారు
Leave a comment