తెలంగాణ వార్త::: నిజామాబాద్ నగరంలో మంగళవారం రాత్రి దొంగలు రెండు చోట్ల చోరీలకు పాల్పడ్డారు. పెద్దపోస్టాఫీస్ సమీపంలోని ఓ మెడికల్ షాపులో దొంగతనం చేశారు. ఒకటోటౌన్ పరిధిలోని ఖలీల్‌వాడిలోని ఓ ల్యాబ్‌లో చోరీ చేశారు. గౌతమి పాథోలాజికల్ ల్యాబ్‌లోకి దొంగలు చొరబడి రూ. 10వేల నగదు ఎత్తుకెళ్లారు. ల్యాబ్ యజమాని బుధవారం ఉదయం షాపుకు వెళ్లగా చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఒకటో టౌన్ ఎస్సై మొగులయ్య ఘటనా చేరుకుని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.


Advertisment

Leave a comment