Home జనరల్ వీర వనిత చాకలి ఐలమ్మ 129 వ జయంతిని ఘనంగా జరుపుకున్న బిజెపి నాయకులు…
జనరల్

వీర వనిత చాకలి ఐలమ్మ 129 వ జయంతిని ఘనంగా జరుపుకున్న బిజెపి నాయకులు…

ఆర్మూర్, తెలంగాణ వార్త:: భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో వీర వనిత చాకలి ఐలమ్మ 129వ జయంతిని పురస్కరించుకొని ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ధోబి ఘాట్ వద్ద ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడమైనది.

ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి బిజెపి జిల్లా అధికార ప్రతినిధి జెస్సు అనిల్ కుమార్ మాట్లాడుతూ…. “భూమికోసం, భుక్తి కోసం — వెట్టి చాకిరి విముక్తి కోసం” ” తెలంగాణ స్వతంత్రం కోసం — రజాకారులను తరమడం కోసం” బట్టలను బండపై ఉతకడమే కాదు అవసరమైతే కొడవలి పట్టి ఓ పులిలా రజాకారులను ఎదిరించినటువంటి ధీర వీరవనిత చాకలి ఐలమ్మ అని.

చాకలి ఐలమ్మ పేరును కోటి లోని మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు పెట్టడాన్ని స్వాగతిస్తూ న్నామని, పేరు పెట్టగానే అక్కడ పరిస్థితులు మారవని మహిళా యూనివర్సిటీలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడమే కాకుండా ఆ విశ్వవిద్యాలయంలో చదువుతున్నటువంటి మహిళలు చాకలి ఐలమ్మ ను ఆదర్శంగా తీసుకొని ఆ ధీరవనిత మాదిరిగా ఈ దేశం కోసం, ధర్మం కోసం, దేశ అభివృద్ధి కోసం విజ్ఞానవంతులై ముందుకు వచ్చిన నాడే చాకలి ఐలమ్మకు నిజమైన నివాళులని. ఈ సందర్భంగా తెలియజేస్తూ అదే విధంగా చాకలి ఐలమ్మ ను ఆదర్శంగా తీసుకొని తెలంగాణ మహిళలు రాబోయే మున్సిపాలిటీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి నిరోధక పనులను వ్యతిరేకించి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను పెద్ద ఎత్తున గెలిపించాలని ఈ సందర్భంగా కోరడమైనది.

ఈ సందర్భంగా తనను సన్మానించినటువంటి రజక సంఘ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేయడమైనది.

ఈ కార్యక్రమంలో బిజెపి ఆర్మూర్ పట్టణ ప్రధాన కార్యదర్శి పులి యుగంధర్, ఓబీసీ మోర్చా ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు బాశేట్టి రాజ్ కుమార్, బీజేవైఎం ఆర్మూర్ పట్టణ ప్రధాన కార్యదర్శి ఉదయ్ గౌడ్, ఓబిసి మోర్చ ఆర్మూర్ పట్టణ కార్యదర్శులు రెడ్డబోయిన దక్షిణ మూర్తి, బట్టు రాము, కార్యకర్తలు పోల మధు, చుక్క అనిల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

ఉచితంగా బతుకమ్మ దసరా చీరలు పంపిణీ చేసిన రవీందర్ యాదవ్….

కార్మికుల కుటుంబాలు సంతోషంగా ఉండాలి పారిశుద్ధ్య కార్మికులకు చీరలను పంచిన రవీందర్ యాదవ్ బతుకమ్మ, దసరా...

జనరల్

డి.పోచంపల్లి లో రాజ శ్యామల యాగంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ గారు..

డి పోచంపల్లి, తెలంగాణ వార్త:: డి. పోచంపల్లి లో ఆర్కే ఎంటర్ప్రైజెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాజ...

జనరల్

వాహనం ఢీకొని బాలుడు మృతి..

ఆర్మూర్, తెలంగాణ వార్త:: టాటా ఎస్ వాహనం ఢీకొని బాలుడు మృతి చెందిన ఘటన భీమ్...

జనరల్

రెవెన్యూలో మళ్లీ వీఆర్వో ల పోస్టులు. మంత్రి పొంగులేటి….

హైదరాబాద్, తెలంగాణ వార్త:: రాష్ట్రంలో మళ్లీ వీఆర్‌వో, వీఆర్‌ఏల సేవలను వినియోగించుకోనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి...

You cannot copy content of this page