బిలియన్ హెయిర్స్ మెన్స్ సెల్యూన్ ప్రారంభోత్సవం.
ఉప్పల్ నియోజకవర్గం, తెలంగాణ వార్త ::జూలై 15: వ్యాపారంలో బాగా రాణించి ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని జిహెచ్ఎంసి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు.
శుక్రవారం ఉప్పల్ నియోజకవర్గం,
కప్రా డివిజన్ లోని నూతన బిలియన్ హెయిర్స్ మెన్స్ సెలూన్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిలుగా జిహెచ్ఎంసి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ,స్థానిక కార్పొరేటర్ స్వర్ణ రాజ్, చర్లపల్లి కార్పొరేటర్ శ్రీదేవి యాదవ్ లు
హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యాపారంలో బాగా రాణించి ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని పేర్కొన్నారు. నిర్వహకులు విశాల్ , శ్రీ మంగళి మాట్లాడుతూ మా మెన్స్ సలూన్ లో ప్రొఫెషనల్ సర్వీస్, ప్రొఫెషనల్ ప్రొడక్ట్స్, ఎయిర్ కండిషన్ తో గుడ్ ఇంటీరియర్ కలిగి వినియోగదారులకు సౌకర్యంగా ఉంటుందని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గోళ్లురి అంజయ్య, టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Leave a comment