రంగారెడ్డి జిల్లా( తెలంగాణ వార్త) . అరవింద్ కుమార్ గారు, ఐఎయస్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ, యం.ఎ & యు.డి డిపార్ట్మెంట్ ఎల్బీనగర్ జోన్ పరిధిలో హబ్సిగుడ నుండి మూసి బ్రిడ్జి మరియు మూసి బ్రిడ్జి నుండి ఎల్బీనగర్ వరకు జరుగుతున్న మోడల్ కరిడార్ పనులను ఉప్పల్ శిల్పారామం దగ్గర పరిశీలించి పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇందులో భాగంగా హెచ్.యం.డి.ఏ ఆధ్వర్యంలో ఉప్పల్ X రోడ్డు వద్ద Rs.25 కోట్లుతో నిర్మిస్తున్న స్కై వాక్ పనులను కూడా పరిశీలించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో శ్రీమతి. ఎస్. పంకజ, జోనల్ కమిషనర్, శ్రీ. బి.ఎల్.ఎన్. రెడ్డి, చీఫ్ ఇంజనీర్, హెచ్.యం.డి.ఏ, శ్రీ. వి. అశోక్ రెడ్డి, ఎస్.ఈ, జి.హెచ్.యం.సి (మైంటెనెన్సు), ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, జి.హెచ్.యం.సి (మైంటెనెన్సు) మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
Leave a comment