లోటస్ పాండ్ లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం
పాల్గొన్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నాయకులు
ఈ రోజు లోటస్ పాండ్ లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలమ్మ అధ్యక్షతన వైఎస్ఆర్ టిపి ముఖ్య నాయకుల మరియు పదాధికారుల సమావేశం జరిగింది .
ఈ కార్యక్రమంలో వైఎస్ షర్మిలమ్మ మాట్లాడుతూ నాయకులందరూ సమన్వయంతో పనిచేసి పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయాలన్నారు
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నాయకులందరు చురుకుగా పనిచేసి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ , ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కో ఆర్డినేటర్ నీలం రమేష్ గారు తెలిపారు
ఈ సందర్భంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నిజామాబాద్ అర్బన్ కో ఆర్డినేటర్ బుస్సాపూర్ శంకర్ మాట్లాడుతూ షర్మిలమ్మ ఆశయాలకు అనుగుణంగా క్షేత్ర స్థాయిలో బలోపేతం చేస్తామని తెలిపారు
ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి సత్యవతి , బోధన్ కో ఆర్డినేటర్ గౌతమ్ ప్రసాద్ , జిల్లా మహిళ కో ఆర్డినేటర్ విజయ లక్ష్మి , అర్బన్ మహిళా కో ఆర్డినేటర్ కృప జ్యోతి , అర్బన్ మైనరిటి కో ఆర్డినేటర్ షేక్ నబి , బొర్గి సంజీవ్ ,పోతరాజు మదన్ , సయ్యద్ ఇమ్రాన్ , ప్రసాద్ యాదవ్ , రాజేష్ , గణ శ్రీనివాస్ , తదితరులు పాల్గొన్నారు
Leave a comment