పియుసి చైర్మన్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారిని కలిసిన కమల నెహ్రూ కాలనీ మాదిగ సంఘ పెద్దలు.
ఆర్మూర్(తెలంగాణ వార్త) డిసెంబర్22: బుధవారం పియుసి చైర్మన్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆర్మూర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు.ఈ క్రమంలో ఆర్మూర్ పట్టణంలోని 29వ వార్డు కమల భాయి మాదిగ సంగం ఆధ్వర్యంలో కమల నెహ్రు కాలనీ మాదిగ సంఘ పెద్దలు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువా పుష్పగుచ్చంతో ఆయన సన్మానించారు. అనంతరం కమల నెహ్రూ కాలనీ మాదిగ పెద్ద మనుషులు, కమల బాయి మాదిగ సంఘ కులస్తులు ఆర్మూర్ పట్టణంలో 29వ వార్డు లో ఎస్సీ ఫంక్షన్ హాల్ కొరకై నిధులు మంజూరు చేయాలని అలాగే స్మశానవాటిక నందు బర్నింగ్ పాయింట్ ల కొరకు నిధులు మంజూరు చేయాలని కోరగా.. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సానుకూలంగా స్పందించి త్వరలోనే నిధులు మంజూరు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అడిగిన వెంటనే వరాలు కురిపించే ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారికి కమల నెహ్రూ కాలనీ మాదిగ సంఘం పెద్దలు కుల సంఘ సభ్యులు ఆయనకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని మనస్ఫూర్తిగా కమల బాయి మాదిగ సంఘం తరఫున కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్మూర్ పట్టణ కమల నెహ్రూ కాలనీ వాసులు కమల బాయి మాదిగ సంఘం అధ్యక్షులు బచ్చపల్లి దేవయ్య,చిన్న దేవయ్య, కందుల రాములు,సంగం ప్రభాకర్,వి.బాబు, తెరాస నాయకులు పొన్నాల రాజన్న తో పాటు తెరాస సీనియర్ నాయకులు పోల మధుకర్, పట్టణ అధ్యక్షులు పూజ నరేందర్ తదితర తెరాస నాయకులు పాల్గొన్నారు.
Leave a comment