(తెలంగాణ వార్త) : సస్పెన్షన్‌లో ఉన్న పంచాయతీరాజ్ అధికారి ఇంట్లో దాడులు జరిపిన ఏసీబీ అధికారులు కోట్ల రూపాయల ఆస్తులు గుర్తించారు.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల పంచాయతీరాజ్ అధికారి సురేందర్‌రెడ్డి అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో రెండు నెలల క్రితం కలెక్టర్ ఆయనను సస్పెండ్ చేశారు. గురువారం సురేందర్‌రెడ్డి ఇంటిలో ఏసీబీ అధికారులు జరిపిన సోదాల్లో ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్టు గుర్తించారు. కోటి రూపాయల విలువ చేసే ఖరీదైన విల్లా, రూ.43.80 లక్షల విలువజేసే నాలుగు ఓపెన్ ప్లాట్లు, రూ.8.11 లక్షల విలువ చేసే రెండెకరాల వ్యవసాయ భూమి, 60.25 తులాల బంగారం, రూ.4.22 లక్షల నగదు, బ్యాంక్ లాకర్లలో 129.2 తులాల బంగారం ఉన్నట్టు తెలిసింది. సురేందర్‌రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు.
Leave a comment