నిజామాబాద్( తెలంగాణ వార్త )నిజాంబాద్ జిల్లా లోని టీచర్ల బదిలీ ప్రక్రియలో 317 జీవోను రద్దు చేయకుండా తెలంగాణ ప్రభుత్వం ఆడిన ఆటలో 9 మంది టీచర్లు బలవన్మరణానికి పాల్పడ్డారని బిజెపి నాయకులు తెలిపారు భీంగల్ మండలం లోని బావా పూర్ గ్రామంలో టీచర్ మరణించిందని తెలియడంతో వెళ్లిన బిజెపి నాయకులకు అక్కడ ఉన్న టీచర్లు ఇంకా ఎన్ని మంది మరణించారని దీనికి బదిలీ లే కారణమనీ టీచర్లు తెలిపినట్లు బిజెపి నాయకులు తెలిపారు. జిల్లాలో తొమ్మిది మంది మరణించడం చరిత్రలో మొదటిసారి. ముందు నుండి టీచర్లు 317 జీవోను రద్దు చేయమని కేసీఆర్ ప్రభుత్వం పై ధర్నా రాస్తారోకోలు చేశారు. అయినా ఫలితం లేకపోయింది. ఒక్క జిల్లాలోనే 9 మంది టీచర్లు మరణించడం ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంత హఠాత్తుగా జరిగిన ఈ ప్రక్రియ ఎవరికీ అర్థం కావడం లేదు ఇంకా చాలామంది తొమ్మిది మంది మరణించడంతో షాక్కు గురై హాస్పిటల్లో చేరినటు తెలిసింది. ముఖ్యమంత్రి 317 జీవోను రద్దు చేస్తేతే ఈ బలవన్మరణాలు కాకపోతే ఉండేది.
Leave a comment