తెలంగాణ వార్త:: ఆర్మూర్ పట్టణంలోని మేరు సంఘం భవనంలో తెలంగాణ హైకోర్టు సౌజన్యంతో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ మిడియేషన్ సెంటర్ ను నిజామాబాదు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి. శ్రీ.కుంచలా సునీత మేడం గారు రిబ్బన్ కట్ చేసి మిడియేషన్ సెంటర్ ని ప్రారంభించినారని ఆర్మూర్ మెడియేషన్ ప్రతినిధులు బాబా గౌడ్, లయన్ నివేధన్ గుజరాతి mjf,శంకర్ గౌడ్ లు పేర్కొన్నారు. అనంతరం జిల్లా జడ్జి మాట్లాడుతూ నేటి సమాజంలో ప్రజలు తమ తమ కుటుంబాలలో, వ్యాపారా వ్యవహారాలలో జరిగే చిన్న చిన్న అనేక రకాల సమస్యలతో పగ,ప్రతికారాము,ఇగోనెస్ లాంటి సమస్యలద్వారా కోర్టుల చుట్టూ,పోలీస్ స్టేషన్ ల చుట్టూ తిరుగుతూ సమయాన్ని, ధనాన్ని వెచ్చించి రక్త సంబంధాలను, స్నేహలను పాడుచేసుకొని కుటుంబ సభ్యులతో వివాదలు పెట్టుకొని ఒంటరి జీవితం గడుపుతున్నారు అలాంటి సమస్యలకు శాశ్వత పరిష్కారమ్ కొరకు మెడియేషన్ సెంటర్ల ద్వారా ట్రేనింగ్ పొందిన సభ్యులతో కౌన్సిలింగ్ ఇప్పించి వారికి తగిన న్యాయం ఎలాంటి ఫీజులు చెల్లించకుండా చట్టరీత్యా,చట్ట బద్ధంగా సేవలు చేయడానికి ఏర్పాటు చేయడం జరిగిందని అందులో భాగంగా పరిష్కరించబడిన కేసులను DLSA ద్వారా అవార్డులను సైతం ఇస్తారాని వారు పేర్కొన్నారు ఇట్టి కార్యక్రంలో ఆర్మూర్ సీనియర్ జడ్జి నజీమ్ సుల్తానా, జూనియర్ జడ్జ్ దీప్తి,నిజామాబాదు సీనియర్ సివిల్ జడ్జ్ పద్మావతి, ఆర్మూర్ ఆర్థివో రాజాగౌడ్,ఏసిపి బస్వారెడ్డి,సిఐ రవికుమార్, DLSA సుపరీండెంట్ RV. పురుశోత్తమ్ గౌడ్,ఆర్మూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు తెడ్డు నర్సయ్య మెరుసంగం అధ్యక్షులు రావినాథ్ తదితరులు పాల్గొన్నారు.
Leave a comment