ఆర్మూర్, తెలంగాణ వార్త: ఆర్మూర్ పట్టణంలోని మండల ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ట్రస్మ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాంతి గంగారెడ్డి, జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ శ్రీ భాషిత సుందర్, మండల అధ్యక్షులు భరత్ చంద్ర మల్లయ్య, ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమ కన్వీనర్ మానస గణేష్ లు ఆదివారం రోజున పెర్కిట్ లోని జి.ఆర్ గార్డెన్స్ లో గురుపూజోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు . ఆర్మూర్ మండలంలోని ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల నుండి ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి వారిని ఆదివారం ఘనంగా సన్మానించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మొదటి సెషన్ లో ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరికీ ప్రముఖ శిక్షకుడు శ్రీనివాస్ రెడ్డి చేత బోధన మెలకువలపై శిక్షణ కార్యక్రమం జరిపించారు. ఆర్మూర్ ని తెలంగాణలోనే ఒక గొప్ప ఎడ్యుకేషనల్ హబ్ గా తీర్చిదిద్దడానికి ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ వారిని సుశిక్షితులుగా తీర్చిదిద్దుతూ వారికి సన్మాన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రోత్సహించాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించా మని వారు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన ఆర్మూర్ ఏసీపీ బసవ రెడ్డి కి, మండల విద్యాశాఖ అధికారి రాజా గంగారాం కు గురుపూజోత్సవ సన్మానం చేశారు. ట్రస్మా రాష్ట్ర, జిల్లా బాధ్యులు హాజరయ్యారు . ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సన్మాన కార్యక్రమం కమిటీ సభ్యులు జెంటిల్ కిడ్స్ ప్రకాష్ , ఆర్మూర్ మండల ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ కార్యదర్శి విద్యా ప్రవీణ్, కోశాధికారి స్కాలర్స్ వేణు, శ్రీ చంద్ర నారాయణ, భార్గవి గోపి, నలంద ప్రసాద్ , శ్రీ స్కూల్ మల్లేష్ గౌడ్, ప్రజ్ఞ వంశీ లు పాల్గొన్నారు.
Leave a comment