తెలంగాణ వార్త::, రంగారెడ్డి జిల్లా బ్యూరో::గణేష్ నిమజ్జనం సందర్భంగా తెలంగాణలో రెండు రోజుల పాటు వైన్స్ బంద్ చేయాలని పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఉత్తర్వులిచ్చారు. దీంతో హైదరాబాద్ లో రెండు రోజుల పాటు వైన్స్ షాపులు మూతపడనున్నాయి. సెప్టెంబర్ 17, 18వ తేదీల్లో వైన్స్ షాపులు బంద్ చేస్తున్నట్లు ప్రకటించారు.
సెప్టెంబర్ 17వ తేదీన ఉదయం 6 గంటల నుంచి సెప్టెంబర్ 18వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలను బంద్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే వైన్స్ షాపులు మాత్రమే మూతపడనున్నాయి.
స్టార్ హోటళ్లు, రిజిస్టర్డ్ క్లబ్ లకు ఈ బంద్ నుంచి మినహాయింపు ఇచ్చింది. ఈ రెండు రోజులు వైన్స్, కల్లు దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు మూసేయాలని పోలీస్ కమిషనర్ ఆదేశించారు. నిమజ్జనం సమయంలో మద్యం తాగి రావద్దని కూడా పోలీసు అధికారులు తెలిపారు.
సెప్టెంబర్ 17, 18 తేదీలలో హైదరాబాద్ నగరంలో భారీ ఎత్తున వినాయక నిమజ్జనం జరుగనుంది. ట్యాంక్ బండ్ పై ఈ రెండు రోజులు భక్తులతో కోలాహలంగా ఉండనుంది. ఇటువైపు వాహనాలను రాకుండా పోలీసులు చర్యలు చేపట్టనున్నారు. నగరంలోని ఆయా ప్రాంతాల మధ్య ఎంఎంటీఎస్ రైళ్లు యథావిధిగా నడపనున్నారు. ప్రత్యేక సర్వీసులు కూడా ఈ రెండు రోజులు అందుబాటులోకి తీసుకురానున్నారు.హైదరాబాద్ లింగంపల్లి, సికింద్రాబాద్ హైదరాబాద్, లింగంపల్లి ఫలక్‌నుమా మధ్య అదనపు రైలు సర్వీసులు కూడా నడపనున్నారు.
Leave a comment