ఆర్మూర్, తెలంగాణ వార్త::అర్ముర్ పట్టణం లో ప్రెస్ క్లబ్ లో ఆదివారం బీజేపీ పత్రిక సమావేశం బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కలిగొట గంగాధర్ మరియు బీజేపీ కిసాన్ మోర్చా సీనియర్ నాయకులు నూతుల శ్రీనివాస్ రెడ్డి గార్లు నిర్వహించడం జరిగింది. ఇట్టి సమావేశానికి బీజేపీ పట్టణ అధ్యక్షులు ద్యాగ ఉదయ్, ప్రధాన కార్యదర్శి పోల్కం వేణు, బీజేపీ కార్యదర్శి అరె రాజేశ్వర్, బీజేపీ కిసాన్ మోర్చా సీనియర్ నాయకులు చిట్టీ భజన్న,అధ్యక్షులు కాపెల్లి లింగం, తేలు ఒడేన్న పాల్గొన్నారు..
బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కలిగొట గంగాధర్ మాట్లాడుతు….
గత శాసనసభ ఎన్నికల్లో ఎన్నో హామీలిచ్చి, అధికారం వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ హామీలను మరచి పోయిందని, ప్రజలకు మేలుచేయడం మరచి ప్రజల నడ్డి విరుస్తుందని,ముఖ్యంగా రైతు రుణాలను పూర్తిగా మాఫిచేయడం లో విఫలం అయ్యారని, రేవంత్ సర్కార్ రైతు వ్యతిరేక ప్రభుత్వం అని, రైతులను ఇబ్బంది పెట్టిన ఏ ప్రభుత్వం మన రాష్ట్రం లో బాగుపడలేదని, ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా పూర్తిగా రైతు రుణాలను మాఫీ చెయ్యాలని అన్నారు.హామీ ఇచ్చి మరచిన ప్రభుత్వం యొక్క మెడలు ఏవిందగా వంచలో మన రైతులకు బాగా తెలుసని అన్నారు.మొన్నటి రోజున తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య సలహా దారుడుగా శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు బాధ్యతలు తీసుకున్నారాని మీ మొట్ట మొదాటి సలహా రైతు రుణాలను మాఫీ చేసి పంట పెట్టుబడి సహాయం రైతులకు అందిoచాలని సీఎం రేవంత్ రెడ్డి గారికి సలహా ఇవ్వవలసిందిగా కోరుతున్నాను, మీరు రైతు పక్ష పాతిగా నిరూపించు కోవలసిన సమయం ఇదేనని తెలిపారు. మీరు గతం లో వ్యవసాయ మంత్రిగా పనిచేశారు స్వతగా మీరు ఒక రైతు కూడ అందుకే రైతు కష్టాలు సీఎం రేవంత్ రెడ్డి కంటే ఎక్కువగా మీకే తెలుసు కాబట్టి ఉమ్మడి జిల్లా సీనియర్ మంత్రిగా రైతు బాధలు అర్థం చేసుకొని రుణాలను మాఫీ చేసి, పెట్టుబడి సహాయం అందించేలా చర్యలు తీసుకోవాలి అని కోరుతున్నాను, లేనిచో రైతులతో కలసి ఉద్యమన్ని ఉదృతం చేస్తామని తెలిపారు.
Leave a comment