ఆర్మూర్ ,తెలంగాణ వార్త:: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని 33 వ వార్డులో బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆదేశానుసారం బిజెపి ఆర్మూర్ నియోజకవర్గ సభ్యత్వ నమోదు సహా కన్వీనర్ జెస్సు అనిల్ కుమార్ నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామాలలో పర్యటించి బిజెపి కార్యకర్తలతో సభ్యత్వ నమోదును జోరుగా నిర్వహిస్తున్నారు. గురువారం ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని 33 వ వార్డులో బిజెపి నాయకులతో కలిసి ఇంటింటికి తిరిగి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జెస్సు అనిల్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నేతృత్వంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు మద్దతుగా నిలవాలని ప్రజలకు తెలియజేస్తూ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శక్తి కేంద్ర ఇన్చార్జి షికారి శ్రీనివాస్, బూత్ అధ్యక్షుడు దక్షిణామూర్తి, మీసాల రాజేశ్వర్, పీర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
Leave a comment