ఆర్మూర్, తెలంగాణ వార్త:: టాటా ఎస్ వాహనం ఢీకొని బాలుడు మృతి చెందిన ఘటన భీమ్ గల్ లో చోటు చేసుకుంది. ఎస్సై మహేశ్ తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం సాయంత్రం భీమ్ గల్ నుంచి సిరికొండకు వెళ్తున్న టాటాఏస్ వాహనం డ్రైవర్ అఫ్రోజ్ అతివేగంగా వెళ్తుండగా.. నందిగల్లీ వద్ద రోడ్డు దాటుతున్న తోపారం నిశ్వంత్(7)ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో బాలుడి తలకు తీవ్రగాయాలు కాగా.. ఆర్మూర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడి తల్లి వనిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
Leave a comment