నిజామాబాద్ ( తెలంగాణ వార్త) : దర్పల్లి మండలంలో శివాజీ మహారాజ్ విగ్రహం ప్రారంభోత్సవానికి ఎంపి ధర్మపురి అర్వింద్ వస్తుండగా అడ్డుకునేందుకు భారీగా టిఆర్ఎస్ కార్యకర్తలు చేరుకున్నారు. దీంతో టిఆర్ఎస్, బిజేపి కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాట ఉద్రిక్తగా మారి ఘర్షణకు దారి తీసింది. ఇందులో ధర్పల్లి ఎస్సై వంశీ కృష్ట తకు తీవ్ర గాయాలయ్యాయి. మరో మహిళా కానిస్టేబుల్కు గాయాలయ్యాయి. ఇదు వర్గాలకు వ్యతిరేక నినాదాలు చేస్తు భయానక వాతావరణాన్ని సృష్టించారు. దీంతో పోలీసులు ప్రారంబోత్సవ కార్యక్రమానికి అనుమతి నిరాకరించారు. గాయాల పాలైన బిజేపి, టిఆర్ఎస్ నాయకులను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Leave a comment