మరోవైపు.. ఇప్పటి వరకు 1000 మంది రష్యా సైనికులు మరణించినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది.
Russia-Ukraine conflict: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు సమీపంలోని కీలకమైన విమానాశ్రయాన్ని హస్తగతం చేసుకున్నట్లు రష్యా సైన్యం ప్రకటించింది. దీంతో పశ్చిమ దేశాలతో కీవ్‌ను దూరం చేసినట్లు తెలిపింది.
వెయ్యి మంది సైనికులు మృతి..
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను ఆక్రమించుకునేందుకు దూసుకెళ్తున్న రష్యా బలగాలను ప్రతిఘటిస్తున్నాయి ఉక్రెయిన్ సేనలు. ఈ దాడుల్లో ఇప్పటివరకు రష్యాకు చెందిన 1000 మందికిపైగా సైనికులు చనిపోయినట్లు ఉక్రెయిన్ రక్షణ శాఖ ప్రకటించింది.
చర్చలకు పుతిన్ సిద్ధం!
ఉక్రెయిన్‌తో చర్చలు చేపట్టేందుకు బెలారస్ రాజధాని.. మిన్స్క్కు ఉన్నతస్థాయి అధికారులను పంపేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సిద్ధంగా ఉన్నట్లు ప్రకటన వెలువడింది. క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ ఈ విషయం తెలిపారని భారత్‌లో రష్యా రాయబారి కార్యాలయం వెల్లడించింది.

హోస్టోమెల్లో అతిపెద్ద రన్‌వేతో కూడిన ఈ ఎయిర్‌పోర్ట్‌కు భారీ రవాణా విమానాలు వచ్చే అవకాశముంది. ఫలితంగా కీవ్ నగర శివార్లలో ఉన్న బలగాల్ని రాజధానికి తరలించడం రష్యాకు మరింత సులువు కానుంది. కీవ్‌కు వాయవ్య ప్రాంతంలో కేవలం 7 కిలోమీటర్ల దూరంలోనే హోస్టోమెల్ ఉంటుంది. రష్యా వాయుసేనకు చెందిన 200 హెలికాప్టర్లు.. హోస్టోమెల్లో దిగేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు ఆ దేశ రక్షణ శాఖ ప్రతినిధి మేజర్ జనరల్ ఇగోర్ కొనషెంకోవ్.
వెయ్యి మంది సైనికులు మృతి..
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను ఆక్రమించుకునేందుకు దూసుకెళ్తున్న రష్యా బలగాలను ప్రతిఘటిస్తున్నాయి ఉక్రెయిన్ సేనలు. ఈ దాడుల్లో ఇప్పటివరకు రష్యాకు చెందిన 1000 మందికిపైగా సైనికులు చనిపోయినట్లు ఉక్రెయిన్ రక్షణ శాఖ ప్రకటించింది.
చర్చలకు పుతిన్ సిద్ధం!
ఉక్రెయిన్‌తో చర్చలు చేపట్టేందుకు బెలారస్ రాజధాని.. మిన్స్క్కు ఉన్నతస్థాయి అధికారులను పంపేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సిద్ధంగా ఉన్నట్లు ప్రకటన వెలువడింది. క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ ఈ విషయం తెలిపారని భారత్‌లో రష్యా రాయబారి కార్యాలయం వెల్లడించింది.
Leave a comment