నిశిత డిగ్రీ కళాశాల చైర్మన్ చౌడవరం వినయ్ కుమార్
నిజామాబాద్ (తెలంగాణ వార్త) అద్భుతమైన హార్డ్ వర్క్ అంకిత భావంతో కూడిన సిబ్బందితో టీం వర్క్ గా ముందుకు వెళ్లడం తోనే
అటానమస్ హోదాను సాధించడం గర్వకారణం అని నిశిత డిగ్రీ కాలేజ్ చైర్మన్ చౌడవరం వినయ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు సోమవారం నగరంలోని నిశిత డిగ్రీ కళాశాల ఆవరణలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిశిత డిగ్రీ కళాశాల చైర్మన్ చౌడవరం వినయ్ కుమార్, వైస్ చైర్మన్ చౌడవరం నిఖిల్ కుమార్ మాట్లాడుతూ.. నిషిత డిగ్రీ కళాశాల 1994 లో 27 సంవత్సరాల క్రితం నిశిత ఎడ్యుకేషనల్ అకాడమీ నిర్వహణ ద్వారా చౌడవరం భూమయ్య వ్యవస్థాపక చైర్మన్ గా స్థాపించడం జరిగిందన్నారు. ఆయన మరణాంతరం 2006లో ప్రతి సంవత్సరం యూనివర్సిటీ టాపర్ విద్యార్థులకు నగదు పురస్కారం అవార్డు ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. 2017 తమకు న్యాక్ ఏ గ్రేడ్ ని సాధించడం జరిగిందని వివరించారు అలాగే కళాశాల యూజీసీ ద్వారా 2(ఎఫ్),12(బి) కింద గుర్తించబడిందన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయం తమ కళాశాలకు శాశ్వత అనుబంధం మంజూరు చేసింది అని తెలిపారు. యూజీసీ ద్వారా ఫిబ్రవరి 2022 నెలలో కళాశాల స్వయం ప్రతిపత్తి హోదాను సాధించడం జరిగిందని రాష్ట్రంలోని పది ప్రైవేట్ డిగ్రీ సెల్ఫ్ ఫైనాన్స్ కళాశాలల్లో నిశిత డిగ్రీ కళాశాల ఒకటి అని సగర్వంగా చెప్పారు. డిచ్పల్లి నిజామాబాద్ జిల్లా తెలంగాణ విశ్వవిద్యాలయంలో అటానమస్ హోదా సాధించిన మొదటి ప్రైవేట్ డిగ్రీ కళాశాల డిగ్రీ కళాశాల అని స్వయం ప్రతిపత్త హోదా తో తాము ఉద్యోగ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా సిలబస్ను మార్చ వచ్చు అని తెలిపారు. కొత్త విద్యా విధానం 2020 అమలు చేయవచ్చని తెలిపారు. విద్యార్థుల ప్రయోజనం కోసం కొత్త పథకాలు కొత్త కోర్సులను అమలు చేయవచ్చన్నారు. అలాగే కోవిడ్ కాలంలో కూడా బహుళ జాతి కంపెనీల లోని మంచి ప్లేస్ మెంట్ లను కలిగి ఉందని పేర్కొన్నారు అలాగే ఇంటర్వ్యూలను ఎదుర్కొనేందుకు ఆంగ్లంలో పట్టుకోసం విద్యార్థులకు ప్రత్యేకంగా శిక్షణ అందిస్తున్నామన్నారు. 2020-2021 సంవత్సరంలో 185 మంది విద్యార్థులు వివిధ బహుళజాతి కంపెనీల్లో చేరారని తెలిపారు. అలాగే 2021-2022 సంవత్సరంలో 58 మంది విద్యార్థులు వివిధ బహుళజాతి కంపెనీల లో స్థానం పొందారు అని తెలిపారు. నిశిత డిగ్రీ కళాశాల 30 కంటే ఎక్కువ కంపెనీలతో అవగాహన ఒప్పందాలను కలిగి ఉందన్నారు. ఇంకా చేస్తున్నాము కాబట్టే అద్భుతమైన హార్డ్ వర్క్ అంకిత భావంతో కూడిన సిబ్బంది ప్రతి ఒక్కరు కలిసి టీం వర్గ ముందుకు వెళ్లడం తోనే అటానమస్ హోదాను సాధించడం జరిగిందని ఇది నిజామాబాద్ జిల్లాకే కాకుండా రాష్ట్రంలో కూడా గర్వించదగ్గ విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో అకాడమీ కోఆర్డినేటర్ చౌడవరం రాజు, అకాడమిక్ డైరెక్టర్ ఓం షేక్ తదితరులు పాల్గొన్నారు.
Leave a comment