ఆర్మూర్( తెలంగాణ వార్త) ఆర్మూర్ పట్టణానికి చెందిన ప్రముఖ విద్యావేత్త ప్రజ్ఞ గంగా మోహన్ స్వర్గస్తులైనారు. ..పట్టణంలో మొదటి ప్రైవేట్ పాఠశాలను స్థాపించి ఆర్మూర్ లో ప్రజ్ఞ గంగా మోహన్ ఆర్మూర్ పట్టణానికి వన్నె తెచ్చాడు. .గంగా మోహన్ అంటే ఆర్మూర్ పట్టణమే కాక నిజామాబాద్ జిల్లా అంతట పేరు మారు మ్రోగి పోతుంది. ఆర్మూర్ పట్టణంలో ఎంతో విద్యార్థిని విద్యార్థులకు బోధన చేసి పెద్ద స్థాయికి తీసుకెళ్లిన గంగా మోహన్ సార్ ని మరువలేము. ఈరోజు జిల్లా అంతటా దుఃఖసాగరం లో మునిగి పోయింది. ఎవరు ఈ విషయం విని తట్టుకోలేక పోతున్నారు. ప్రజ్ఞా స్కూల్ అంటే వినని వారు లేరు. గంగా మోహన్ సార్ ను చూసి ఆర్మూర్ పట్టణమే కాక నిజామాబాద్ జిల్లాలోనే చాలా ప్రైవేట్ స్కూల్స్ స్థాపించారు. ప్రైవేట్ స్కూల్ అధ్యక్ష పదవి కూడా ఆయన నిర్వహించాడు. కల్మషం లేని మనిషి ప్రజ్ఞ గంగా మోహన్ సార్ మమ్మల్ని వదిలి స్వర్గస్తులైనారు. చిన్న వయసులోనే పెద్ద పేరు తెచ్చుకొని అందర్నీ దుఃఖసాగరంలో మంచి వెళ్ళిపోయాడు ఓం శాంతి.
Leave a comment