Home హాట్ న్యూస్ పోలీసులు షాక్
హాట్ న్యూస్

పోలీసులు షాక్

హైదరాబాద్( తెలంగాణ వార్త) స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ ( సెబ్) సీఐ మంజుల తెలిపిన వివరాల ప్రకారం.. సరిహద్దు ప్రాంతంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి తమిళనాడు, కోయంబత్తూరు వెళ్తున్న స్వామి అయ్యప్ప ట్రావెల్ బస్సు (ఎన్ఎల్ 01బి 1149 )ను పరిశీలించారు. అందులో ప్రయాణిస్తున్న దేవరాజు, సెల్వరాజ్, కుమార వేలు, మురుగేశన్, వెంకటేష్ బ్యాగులలో సుమారు 28.5 కేజీల వెండి బిస్కెట్లు, 8.250 కేజీల బంగారు బిస్కెట్లను అలాగే స్లీపర్ సీట్ల కింద రూ. 90 లక్షల నగదును పోలీసులు గుర్తించారు. అందులో వెంకటేష్ ఏకంగా వినూత్న రీతిలో అంగి లోపల ప్రత్యేక జాకెట్ లో బంగారం దాచాడు. అందుకు సంబంధించిన వీరందరిని పోలీసులు విచారించగా హైదరాబాద్‌లో వివిధ జ్యువెలరీ షాప్‌ల నుంచి ముడి బంగారు, వెండి తీసుకుని తమిళనాడు రాష్ట్రంలో సేలం పట్టణంలో ఆభరణాలు తయారు చేసుకుని తిరిగి వాటిని హైదరాబాద్ జ్యువెలరీ షాప్ కి అప్పగిస్తామని అందుకు మేకింగ్ ఛార్జ్ ఇస్తారని వారు పోలీసులకు తెలిపారు. వీటి విలువ రూ 5.4 కోట్లు ఉంటుందని అంచనా. పట్టుబడిన నగదు ,బంగారు, వెండి కి సంబంధించిన ఏలాంటి ధ్రువ పత్రాలు లేనందున విచారణ నిమిత్తం కర్నూల్ తాలూకా పోలీసు స్టేషన్ కి తరలించినట్లు సెబ్ అధికారులు తెలిపారు. తనిఖీల్లో ఎస్సై ప్రవీణ్ కుమార్,ఖాజా,సుంకన్న, సుందర్,విజయ్ భాస్కర్ పాల్గొన్నార సరిహద్దు కర్నూలు శివారులోని పంచలింగాల చెక్ పోస్ట్ వద్ద జరిగిన సంఘటన.కొందరు అక్రమార్కులు బంగారం,నగదు డబ్బులను తరలించడంలో కొత్త కొత్త దారులు వెతుక్కుంటున్నారు. ఆ దారులు ఎలా ఉన్నాయంటే పోలీసులే షాక్ తింటూ అవాక్కయ్యే విధంగా ఉన్నాయి.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page