యాదాద్రి ఆలయ పునర్ నిర్మాణం అద్భుతం
-ఆధ్యాత్మిక ఘట్టాన్ని ఆవిష్కరించిన కేసీఆర్
-స్వామి వారి కలశ పూజలో పాల్గొన్న జీవన్ రెడ్డి దంపతులు
హైదరాబాద్: మర్చి28 :- యాదాద్రిలో సోమ వారం నేత్రపర్వంగా జరిగిన శ్రీ లక్ష్మీ నారసింహుడి మహా కుంభ సంప్రోక్షణ మహోత్సవంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు వివిధ గోపురాల వద్ద కలశ పూజ నిర్వహించారు.
ఈ కలశ పూజలో పాల్గొన్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, పీయూసీ ఛైర్మన్ , ఆర్మూర్
ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. దివ్య విమాన గోపురంపై శ్రీ సుదర్శన చక్రానికి సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించి, పవిత్ర జలాలతో అభిషేకం నిర్వహించిన ఈ కార్యక్రమంలో జీవన్ రెడ్డి దంపతులకు కంకణధారణ చేసిన వేద పండితులు ఆశీర్వచనం అందించారు. ఏడు గోపురాలపై ఉన్న కలశాలకు ఏకకాలంలో కుంభాభిషేకం, సంప్రోక్షణ నిర్వహించారు. రాజ గోపురాలపై స్వర్ణ కలశాలకు 92 మంది రుత్వికులతో విమాన గోపురాల శిఖరాలపై కలశ సంప్రోక్షణ కైంకర్యాలు నిర్వహించారు.
ఇదో ఆధ్యాత్మిక ఘట్టం-జీవన్ రెడ్డి
యాదాద్రి ఆలయ పునర్ నిర్మాణం అద్భుతమని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్ ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఎన్నో చరిత్రాత్మక ఘట్టాలకు కారణమైన సీఎం కేసీఆర్ నేడు యాదాద్రి లక్ష్మీ నరసింహుడు ఆలయాన్నీ అద్భుతంగా పునర్నిర్మాణం చేసి నేడు సంప్రోక్షణ చేయడం ద్వారా ఒక ఆధ్యాత్మిక ఘట్టాన్ని ఆవిష్కరించారని జీవన్ రెడ్డి అన్నారు.
Leave a comment