Home హాట్ న్యూస్ ప్రేమ హత్య ఇదేంది సామి.
హాట్ న్యూస్

ప్రేమ హత్య ఇదేంది సామి.

తెలంగాణ వార్త: దేశంలో వేర్వేరు చోట్ల అమానవీయ ఘటనలు జరిగాయి. ఓ మైనర్ తన కొత్త బాయ్​ఫ్రెండ్​తో కలిసి మాజీ బాయ్​ఫ్రెండ్​ను గొంతునులిమి హత్య చేస అనంతరం మృతదేహాన్ని బ్యాగులో తీసుకెళ్లి తన ఇంటికి మూడు కిలోమీటర్ల దూరంలో పాతిపెట్టింది. మరో ఘటనలో కన్న తండ్రే ఐదేళ్ల బాలున్ని హతమార్చి, అనంతరం బాత్​రూమ్​లో గొయ్యి తీసి పూడ్చిపెట్టాడు.

ఉత్తరాఖండ్​లో దెహ్రాదూన్​లో దారుణం జరిగింది. ఓ మైనర్ తన కొత్త బాయ్​ఫ్రెండ్​తో కలిసి మాజీ బాయ్​ఫ్రెండ్​ను హత్య చేసి చేసింది. అనంతరం మృతదేహాన్ని బ్యాగులో తీసుకెళ్లి తన ఇంటికి మూడు కిలోమీటర్ల దూరంలో పాతిపెట్టింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

నలపానీ అవుట్​పోస్ట్ ప్రాంతంలో యువకుడు నరేందర్(27) మిస్సింగ్ కేసు నమోదైంది. దర్యాప్తు ప్రారంభించిన పది రోజులకు పోలీసులకు విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. నరేందర్​కు ప్రేమ వ్యవహారం ఉందని తెలుసుకున్న పోలీసులు.. ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. ‘నరేందర్ ప్రేమికురాలు పంచర్ షాప్ నిర్వహకుడు ఆకాశ్​(22)తో ప్రేమలో ఉంది. చాలాసార్లు నరేందర్ తన ప్రియురాలుతో మాట్లాడాలని ప్రయత్నించాడు. ఈ క్రమంలో విసిగిపోయిన ఆమె.. తన కొత్త ప్రియునితో కలిసి పథకం పన్నింది. నరేందర్​ను ఇంటికి పిలిచి హత్య చేశారు. అనంతరం బ్యాగులో తీసుకెళ్లి ఇంటికి దూరంగా భూమిలో పాతిపెట్టారు.’ అని పోలీసులు తెలిపారు. నిందితులను అరెస్టు చేశామని చెప్పారు. మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టానిరి పంపామని వెల్లడించారు.

ఛత్తీస్​గఢ్​ గరియబంద జిల్లాలో అమానవీయ ఘటన జరిగింది. కన్న తండ్రే ఐదేళ్ల బాలున్ని హతమార్చాడు. అనంతరం బాత్​రూమ్​లో గొయ్యి తీసి పూడ్చిపెట్టాడు. ఈ ఘటన మెయిన్​పురి పోలీస్ స్టేషన్​ పరిధిలోని తెమ్లీ గ్రామంలో జరిగింది. తండ్రి మద్యానికి బానిస అయ్యాడు. నిరంతరం ఇంట్లో అందర్ని కొడుతుండేవాడు. ఆయన పోరు పడలేక పిల్లలతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లింది నిందితుని భార్య. అక్కడకు వెళ్లిన నిందితుడు.. పిల్లలను తనతో రమ్మన్నాడు. వారు నిరాకరించేసరికి పిల్లాడ్ని ఎత్తుకుని సొంత ఇంటికి వచ్చేశాడు. ఈ క్రమంలో ప్రతిఘటిస్తున్న పిల్లాడ్ని మద్యం మత్తులో చితకబాదాడు తండ్రి. దీనితో ఆ బాలుడు మృతి చెందాడు. ఈ నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఇంటి బాత్​రూమ్​లో గొయ్యి తీసి పాతిపెట్టాడు. ఇరుగుపొరుగువారితో కలిసి ఇంటికి వచ్చిన భార్య నిజం తెలుసుకుని కన్నీరుమున్నీరైంది. నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేశారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page