తెలంగాణ వార్త :మంగళవారం పిప్రి గ్రామానికి చెందిన మినీ యంగ్ యూత్ క్లబ్, రాబిన్స్ యూత్ క్లబ్, భవాని యువజన క్లబ్బులకు ఆర్మూర్ నియోజకవర్గ బిజెపి నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ కంచెట్టి గంగాధర్ వాలీబాల్ మరియు ఇతర ఆటవస్తువులను మన నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ప్రియతమ నేత ధర్మపురి అరవింద్ గారి ఆదేశానుసారం వితరణ చేశారు.
కంచెట్టి గంగాధర్ గారు మాట్లాడుతూ యువకులు ఆటలాడుతూ ఉల్లాసంగా ఉత్సాహంగా ఆరోగ్యంగా ఉండి మంచి భవిష్యత్తును కలిగి ఉండాలని యువకులను ఉద్దేశించి అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ పాన్ శ్రీనివాస్ ,మాజీ ఎంపిటిసి కరణం కృష్ణ గౌడ్ , మందుల బాలు, పండరి ,దోండి ప్రకాష్ ,మహేష్ ,కృష్ణ, యోగేష్ ,హరీష్, మరియు యువజన సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Leave a comment